కలలోనే ప్రయాణము – కవిత

సదా నీ ధ్యానము

కలలోనే ప్రయాణము

ఇలపై నీ జీవనయానము

                               సాగించవోయ్…

రేయి౦పగళ్ళు నీ పోరు

నడి సంద్రమున జోరు

బంకమన్ను దున్ని సాగు

                               సాగించవోయ్…

మెలుకువతో స్వప్నాలు

ఒంటరిగా తలంపులు

నలుగురి సుఖమే నీ పాటల పల్లవై

                               సాగించవోయ్…

నిదురలో హొయలు

ఉదయించే లయలు

మది వీణను మీటగ నిజలోకముల

                               సాగించవోయ్…

1 thought on “కలలోనే ప్రయాణము – కవిత”

Comments are closed.