గడియారం – కవిత

నిమషాల ముల్లు తిరుగుతూ

నించోనివ్వదెందుకో

సెకెండు ముల్లు సాగుతూ

భయన్ని పెంచునెందుకో

గంటలు గంటలు కదులుతూ

దడని తెప్పించునెందుకో

టిక్ టిక్ అంటూ

ఆలోచనలని రానివ్వదెందుకో

రోజులు కదలిపోతున్నాయని

గుర్తుచేసునెందుకో

రాజకీయ నాయకులైనా, ఆఫిసర్లైనా

రైతులైనా, సైనికులైనా

విధ్యార్ధులైనా, నీవైనా, నేనైనా

ఎంతటి ఘనుడైనా

భయపడాల్సిందే…

భయపడాల్సిందే…