ప్రేమ – కవిత

వెన్నెల రాత్రుల అందాలను

వర్ణించే ప్రేమికులను చూసి పిచ్చివారనుకున్నాను

తొలిచూపులోనే నీ ప్రేమలో పడిన నాకు 

ఆ తరువాతే తెలిసింది

ప్రేమలో పడితే అమవాస్య నిశి సైతం

పున్నమి వెన్నెల కురిపిస్తుందని

ఎడారి సైతం నందనోద్యానవనంలా

మదిని పరవశింప చేస్తుందని

1 thought on “ప్రేమ – కవిత”

Comments are closed.