కాలుష్యం – కవిత

ఎన్ని చట్టాలు చేసినా

ఏముంది లాభం

వాతావరణ కాలుష్యం

కబళిస్తోంది పసిప్రాణాలు

గాలి నీరు ధ్వని కాంతి అన్ని 

కాలుష్య కాసారాలే

కాలుష్యాన్ని తుదముట్టించాలి

కాపాడాలి పసి ప్రాణాలు

స్వఛ్చ వాయువు

ప్రతి పౌరుడి హక్కు

అమూల్య పర్యావరణ రంగంలో

అతి ప్రమాదకరమైన మార్పులా?

స్వఛ్చ పర్యావరణానికి

చేతులు కలపాలి మనమంతా

నియంత్రించాలి కాలుష్యాలు

కాపాడాలి బాలభారతం