వెళుతున్నా…! – కవిత

వెళుతున్నా…! నేను

గాఢాంధకారంలో చిక్కిన ప్రజలకు

వెలుగుజాడ చూపడానికి…

ఒంటరినై అన్వేషిస్తూ…

వెళుతున్నా…! వెళుతున్నా…!

మరి నాతో వచ్చెదెవరు…?

నాకు తోడుగా నిలిచేదెవరు…?

నలుదిక్కులలో

ఏ దిక్కుకని వెళ్లను?

గ్రుడ్డివాడినై వెళుతున్నా నాకు…

మార్గనిర్దేశం చేసేదెవరు?

అవినీతి అనే అంధకారంలో చిక్కుకున్న

నా భారతమ్మని విడిపించేదెవరు?

నేనా…మనమా…? మరెవరు…?