జ్వాలముఖి | ధారావాహిక ఎ-1

జ్వాలముఖి | ధారావాహిక ఎ-1

          ఈ మహానగరం ఎంత అందంగ ఆనందంగా అమాయకంగా కనిపిస్తుంది, ఇంకా కొన్ని రోజులలో మహప్రళయం వచ్చి ప్రపంచం అంత కనుమరుగు అయ్యిపోతుంది అని గ్రహించలేకపోతుంది. ఈ మహాప్రళయం నుంచి కాపాడటానికి ఆ భూదేవి (Lord Of The Earth) ఏదో ఒక అవతారం ధరించి రావలిసిందే.

          నగరం అంతా …. ఫ్లాష్ న్యూస్…        ఫ్లాష్ న్యూస్…       ఫ్లాష్ న్యూస్…

          మహా సింధు సముద్రంలో మహాశక్తి విగ్రహం ఉంది అని పరిశోధకులు కనిపెట్టారు. అంతే కాదు ఆ విగ్రహం ఎన్నో సంవత్సరాలకు చెందింది అని కూడా చెప్పారు.  ఆ శక్తి విగ్రహం ని బయటకి తీసుకు వద్దాము అని చాలా మంది ప్రయత్నించారు కాని వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు అందరు మరణించారు.  

          ఒక పరిశోధకుడు ధైర్యం చేసి ఆ శక్తిని చుడటానికి వెళ్ళి మరణిస్తాడు, కాని మరణించే ముందు ఆ మహాశక్తి విగ్రహంని Calypso కెమెరలో బంధిస్తాడు

          ఇప్పుడు మనం ఆ మహాశక్తి విగ్రహం యొక్క చరిత్ర ఏంటి అనేది చూద్దాం.

          భారత ఖండం రాజ్యాలకి రాజులకి పెట్టింది పేరు. అటువంటి దేశంలో పూర్వం ఎందరో రాజులు ఆకాశంలో ఉల్కల్లా కాంతివంతంగా ప్రకాశించి నేల రాలారు. జీవించింది కొంతకాలమే అయినా ఎప్పటికీ చరిత్రలో నిలిచి పోయె కీర్తి గడిస్తారు.

          అలాంటి రాజుల్లో ఒకరే కుముది రాజ్యం మహారాజు “అగ్నిమిత్ర నంద“. తన పాలనలో ఆ రాజ్య ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండేవారు. ఎన్నో రాజ్యాలపై యుద్ధం ప్రకటించి విరోచితంగా పోరాడి గెలిపొందేవారు మహారాజు. ఆ వేళ కూడా అలాగే ఒక దేశంపై యుద్ధం ప్రకటించారు. కాని దురదృష్టవశాత్తు అగ్నిమిత్ర నంద ఓడిపోయి వీర మరణం పొందారు.

          మహారాజు గారి సహధర్మచారిణి మహారాణి “అవంతిక దేవి“. రాణి గారి గురించి చెప్పాలంటే రాజుగారితో వీర పరాక్రమంలోకాని ధైర్యసాహాసాల్లోకాని ఏ మాత్రం తీసుపోదు. చిన్నప్పటి నుండి తన తండ్రి దగ్గర కత్తిసాము, యుద్ధ విద్యలు నేర్చుకుంది. అందం అందానికి తగ్గ పొగరు, దర్పం ఆమె సొంతం. ఎప్పుడూ తను గెలవాలి అనే తపన ఉండేది. ఓటమిని జీర్ణించుకునే రకం కాదు. తన చేయి ఎప్పుడు పైన ఉండాలనే తత్వం. అందుకు ఎంతటి కష్టం అయిన చేస్తుంది.

          అన్నట్టు పరమేశ్వరునికి పరమ భక్తురాలు. రాజుగారి మరణం తర్వాత రాజ్య బాధ్యతలు, ప్రజల సంరక్షణా భారం తన పై పడింది. తన భర్త లాగే ఆ రాజ్యాన్ని సురక్షితంగా కాపాడాలనుకునేది . కుముది రాజ్యం గురించి చెప్పాలి అంటే పచ్చటి పంటపొలాలు, ధనరాసులతో సుసంపన్నంగా ఉండేది. రహదారులపై వజ్రవైడూర్యాలు, పచ్చలు, కెంపులు, బంగారం కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళు. ఆ రాజ్యం లక్ష్మీ దేవి నివాసమా అన్న మాదిరిగా ఎల్లప్పుడు కనక వర్షం  కురిసేది. అలాంటి రాజ్యాన్ని తన భర్త తర్వాత మహారాణి ఏ లోటూ రాకుండా పాలించేది. తన పరాక్రమానికి గుర్తుగా తన భర్త నామధేయమే తనకి బిరుదుగా లభించింది. ఆ బిరుదు “అగ్నిహోత్రి”. అంతటి సుసంపన్నమయిన రాజ్యాన్ని ఆక్రమించాలని చాలా రాజులు తన భర్త హయాంలో, తన హయాంలో యుద్ధాలు ప్రకటించారు. ఓటమి తెలీదన్న మాదిరిగా అన్నింటిలోనూ గెలిచేది మహారాణి. పౌర్ణమి తర్వాత అమావాస్య వచ్చినట్టు, ఎంతటి వీరులకైన ఓటమి రుచి చూడక తప్పదు. ఇప్పుడు రాణి గారి వంతు, ఆ ఓటమి చూడడం. యుద్ధాల్లో ఓటమి వల్ల తన ధనాగారం రోజురోజుకి తగ్గుతూ వస్తుంది. యుద్ధాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాజ్య సంపద కరిగిపోతుంది. ఎందరో సైనికులు మరణిస్తున్నారు. రాణిగారికి ఏమి చేయాలో తోచదు. ఏ బాధ వచ్చినా శివుణ్ణి ప్రార్థిస్తుంది మహారాణి. తన పూర్వ వైభవం మళ్ళీ రావాలని మాహాశక్తికి విశేష పూజలు చేయిస్తుంది, దొరికిన ప్రతిరాయిని కొలుస్తుంది. కాని ఫలితం దక్కదు. తన పూజా మందిరానికి వెళ్ళి మౌనంగా శంకరుడిని వేడుకుంటుంది పరిష్కారం కోసం.

                    అనంత ఆకాశమే సంపద నోనరించే విభూతి    

                                                  అయి కొలువై ఉండగా

                    ప్రచండ వాయువులే కాలి అందెలు అయి

                                                  సవ్వడి చేయగా

                    అఖండ త్రేతాగ్నులే ఆయుధాలయి

                                                  హస్తమున నిలువగా

                    ప్రాణాధారమైన  జలమే శ్వేతా వస్త్రమై

                                                  ప్రకాశించగా

                    ఓర్పు గల మహియే రుద్రాక్షలై మేనిని

                                                  అలంకరించగా

                    అద్వితీయ కుండలిని శక్తి నాగేంధ్రుడై

                                                  కంఠమున వశమవ్వగా

                    పంచభూతాధిపతి అయిన పరమేశ్వరుడు

                                                  పంచముఖుడై అలరారగా

                    మనస్సు నీ ఊహ తప్ప ఏమి

                                                  మిగులును శంకరా!

          మరసటి రోజు రాణి గారికి కబురు వస్తుంది. ఎవరో తనని కలవడానికి వచ్చారని, రాజ్యసభలో వేచి చూస్తున్నారని చెప్తుంది చెలికత్తె. అతిథి మర్యాదలు చేయమని చెప్పి పంపిస్తుంది. కాసేపటికి రాజ్యసభకి వెంచేస్తుంది రాణివారు. వచ్చిన వ్యక్తిని చూడగానే ఎవరో ఆప్తులని చూసినట్టుగా అనిపించింది రాణి వారికి. మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతుంది రాణి గారు.

          ఆ వచ్చిన వ్యక్తి తన పేరు “ఆషుతొష్” అని తను పరిచయం చేసుకొని, ఆ రాజ్యం అలా ధనవిహీనం అవుతున్నందుకు భాధని తెలిపి, ప్రజలకి మేలు చేయాలనుకుంటున్నానని, ఇంక మీ లాంటి మంచి మనసు ఉన్నావాళ్ళకి ఇలాగ జరగకూడదని, మీ పూర్వ వైభవం మళ్ళీ మీకు ప్రాప్తిస్తుంది అందుకు ఒక మార్గం ఉంది అని చెప్తారు. రాణి వారు మిక్కిలి సంతోషితులై వారికి వినమ్రంగా నమస్కరించి ఆ పరిష్కారం చెప్పి ఆదుకోమని కోరుతుంది- దానికి తమరు ఏమి అడిగిన ఇస్తామని హామి ఇస్తుంది. అందుకు ఆ వ్యక్తి చిరుమందహాసం ఇచ్చి తనకేమి వద్దని, ప్రజలకి మంచి చేయాలనే మీ తపన వృధాపోకూడదు అనే పరిష్కార మార్గంతో వచ్చానని చెప్తారు.

          ఆషుతొష్ రాణితో ఇలాగ అంటారు – “ఇక్కడికి తూర్పున కొంచం ముందరకి వెళ్తే “హారీణీవనం” అనే అడవి ఉంది. అందులో ఒక సరస్సు ఒడ్డున ఒక ఆశ్రమం ఉంటుంది. అందులో ఒక ఋషి పుంగవుడు తపమాచరిస్తున్నారు. ఆయనకి అన్ని విద్యలలో ప్రావీణ్యం ఉంది. మీ ఈ స్థితికి చక్కని పరిష్కారం మార్గం చూపెడతారు, మీకు మార్గ దర్శకుడైతారు, వెంటనే అతనిని పిలిపించి మీ సమస్య వినిపించండి” అని చెప్తారు.  

          రాణివారు సంతోషం పట్టలేక ఆ శివుడే ఈ వ్యక్తిని పంపించాడని భావించి పూజామందిరంకి వెళ్ళి మనసార ప్రార్థించి వస్తుంది. వచ్చి చూసేసరికి ఆ వ్యక్తి కనపడరు. భటులని ఆ వ్యక్తి గురించి అడిగితే – “ఇందాకే సెలవని చెప్పి బయలుదేరారు” అని చెప్తారు. ఇంత సహాయం చేసిన వారికి ఏమి ఇవ్వలేదు, రాజ మర్యాదలు చేయాలి వెళ్ళి తీసుకురండి అని చెప్తారు. భటులు రాజ్యం అంత వెతికి వస్తారు. రాణి వారు అతని గురించి అడుగుతారు భటులను. వారు ఎంత వెతికిన కనపడలేదని, క్షణాల్లో కనుమరుగైపోయారు అని చెప్తారు. రాణి గారికి ఏమి అర్థం కాక పూజ మందిరం వైపు అడుగేస్తారు. అక్కడ శివ లింగం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు అనిపించి వచ్చిన వ్యక్తి ఆ ధైవ స్వరూపమే అని అర్థమై సంతోషిస్తుంది. తను చేసిన పూజలకి ఫలితం దక్కిందని అనుకొంటుంది. ఇంక అతను చెప్పిన పేరు “ఆషుతొష్”( one who fullfill wishes instantly) శివుడికి ఉన్న ఎన్నో పేరుల్లో  ఇది ఒక పేరు అని కూడా గుర్తొస్తుంది.  

          రాణివారు వెంటనే తన భటులను పిలిచి అత్యంత గౌరవమర్యాదలతో ఆ ఋషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తుంది. రాణిగారి ఆజ్ఞ ప్రకారం భటులు ఋషిని తీసుకువస్తారు. రాణి గారు ఋషికి అతిథి మర్యాదలు చేయించి సత్కరిస్తుంది. ఆ రాజ్య మర్యాదకి ముగ్ధుడైన ఋషి ఏం వరం కావాలో కోరుకోమంటారు రాణిని. రాణి వారు తన సమస్య విన్నపించి తగిన పరిష్కారం చూపమంటారు. దానికి ఆ మునివర్యులు ఇలా చెబుతారు – “మీరు మీ రాజ్యం కోసం, ప్రజల కోసం మళ్ళీ రాజ్యం సుసంపన్నమవ్వాలని కోరుకుంటున్నారు మంచిది. తప్పక పరిష్కారం చూపెడతాను. ఇన్ని రోజులు ఎన్నో పూజలు చేసారు, అన్నింటికి ఫలితం ఇప్పుడు లభిస్తుంది. కానీ నేను చూపబోయె మార్గం చాల కఠినమైనది. అనేక కష్టాలు ఎదురౌతాయేమో! అన్నింటికి సిద్ధమే అనుకుంటే పరిష్కారం చెబుతాను. ఒకవేళ నేను చెప్పిందానికి ఏదన్న వ్యతిరేకంగా జరిగితే తమరి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది” – అని హెచ్చరిస్తారు.

          రాణి గారు సంతోషంగా తన రాజ్యం కోసం, ప్రజల క్షేమం కోసం ఎంతటి కష్టం అయినా స్వీకరిస్తాను అని, ఆ మార్గం సెలవివ్వమని అడుగుతుంది. ఋషి సంతోషించి ఇలా సెలవిస్తారు – “ఈ రాజ్యానికి 300 మైళ్ల దూరంలో ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం మధ్య జలగర్భంలో ఒక గుహ ఉంది. ఆ గుహలోనికి ప్రవేశించగలిగితే అందులో ఒక మహాశక్తి విగ్రహం ఉండటం కనిపిస్తుంది. ఆ విగ్రహం ముందు క్షీర సముద్ర  తనయ లక్ష్మీదేవి నివాసముండే కమలం ఉంటుంది. ఆ కమలంలో ఒక పేటికలో జ్వాలముఖి మణి ఉంటుంది. ఆ దివ్యమైన జ్వాలముఖి మణి శివుడికి క్షీర సాగరమధనం ద్వార లభిస్తుంది. అప్పుడు దానిని ఆ మహాశక్తి దగ్గర భద్రపరుస్తాడు శివుడు.

 మణి మీకు భవిష్యత్తు చూపి నీకు మార్గదర్శకం అవుతుంది శక్తి విగ్రహం ముందు నిలబడి నేను చెప్పే మంత్రం జపిస్తే  జ్వాలముఖి మణి  దివ్యజ్యోతులు వెదజల్లుతూ  శక్తి ఆకారంలో కి మారుతుందితరువాత దే మంత్రం జపిస్తే మళ్ళీ జ్వాలముఖి మణి ఆకారంలోకి మారిపోతుంది శక్తి ఆకారంలోకి మారినప్పుడునీ భవిష్యత్తు ఏంటో చూపిస్తుంది.  కాని ఎప్పుడంటే అప్పుడు అక్కడికి వెళ్ళడం కుదరదుమకర సంక్రాంతి పర్వదినాన సూర్యాస్తమయం వేళ మకరజ్యోతి దర్శనం లభించే పుణ్య ముహూర్తాన మాత్రమే అక్కడ వెళ్ళి  శక్తి దర్శనం చేసుకొని మంత్రం జపించాలిఅప్పుడు మాత్రమే పనిచేస్తుంది” – అని చెప్పి మంత్రం చెబుతాడు

vṛndāvanāvani-pate! jaya soma soma-maule

sanaka-sanandana-sanātana-nāradeya

gopīśvara! vraja-vilāsi-yugāṅghri-padme

prema prayaccha nirupādhi namo namas te

Saṅkalpa-kalpadruma

          అంతా విన్న రాణి వినమ్రంగా నమస్కరిస్తుంది.

(ఇంకా ఉంది)

భాగాలు: 1234