గమనం – కవిత

ఆ అఖిల నయనాల అశ్రువులు

కపోలములపై గమనమై

పరుగులిడుతు ప్రవహించుతున్నవి..!!

ఎలా? ఎలానమ్మా?

నీకు ఆ మనో వ్యధ

ఆ ద్రుగింద్రియముల నుండి జారే 

శోకాగ్ని రవ్వలతో అఖండ భారతం

జ్వలించుకుపోవుతున్నది..!!

ఆ తల్లి ఖేదముకు తర్కము

ఈ మగవాఁడే కదా..!!

అఖిలానికి అంకపీఠమై

నిఖిలం పరిత్రాణము

జేయుచున్నది ఆ స్త్రీమూర్తి..!!

అట్టి అంబుజాక్షులను

గుడిలో, మడిలో, బడిలో

నట్ట నడిరోడ్డులో

కామ ప్రేత.. భూత.. పిశచాలై

ఆమె మాన ప్రాణాలను

తీస్తుంటే.. చూడలేక

నేత్రాలు శిలాద్రవ బాష్పాంబులను

విడుగడ చేయుచున్నవి..!!

1 thought on “గమనం – కవిత”

 1. Haii frdss
  ఒక అబ్బాయి వాడికి లవ్ అంటే సరిగా తెలిదు..ఎలా చేయాలో తెలిదు..కాని అనుకోకుండా,ఒక రోజు దారిలో వెళ్తూ ఒక అమ్మాయి చూసాడు.వాడికి ఆ అమ్మాయి చాలా నచ్చింది…నచ్చడం అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నంతగా నచ్చింది కాని ఆ అమ్మాయికి ఎలా చెప్పాలి…ఏమని చెప్పాలో వాడికి అర్థం కాలేదు.

  ఇక రోజూ, వాడు ఆ అమ్మాయి ని follow అవ్వడం start చేశాడు…తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు..తన ఇంటి వరకు follow అయ్యేవాడు…ఆ అమ్మాయికి అర్థమైంది వాడు లవ్ చేస్తున్నాడు అని……..

  తనకి వాడంటే ఇష్టం ఏర్పడింది… కాని తన ఫ్రెండ్స్ ఒకరోజు వాడిని చూసి చీ..చీ వాడు అసలు ఎం బాగున్నాడు వాడిని ఎలా లవ్ చేస్తున్నావ్ అని అన్నారు..అది విన్నప్పటినుంచి వాడిని ఆ అమ్మాయి అస్యహించు కోవడం మొదలుపెట్టింది..ఒక రోజు వాడు తన తో మాట్లాడాలని ధైర్యం చేసుకొని వచ్చాడు…

  Boy:- హాయ్….నీతో కొంచెం మాట్లాడాలి..

  Girl:- చెంప పగిలిపోద్ది…ఎక్కువ చేస్తే….

  Boy:- ఎందుకు అంత కోపం అవుతున్నావ్..నేను ఎం చేసా…

  Girl:- నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావ్..ఎందుకు ఫాలో అవుతున్నావ్…

  Boy:- నువ్వంటే నాకు చాలా ఇష్టం…నాకు లవ్ ఎలా చెయ్యాలో.. చెప్పాలో…తెలిదు…కాని నీ పైన నా ప్రేమ నిజం నువ్వంటే నాకు ప్రాణం..

  Girl:- నీ True లవ్ నాకేం అవసరం లేదు…Get Lost…

  అబ్బాయి అక్కడినుంచి..బాధతో వెళ్ళిపోయాడు..తనని మర్చిపోలేక..మళ్ళీ తనని follow అవ్వటం start చేసాడు..అమ్మాయికి విసుగు వచ్చి..

  ఒకరోజు రేయ్ మళ్ళీఎందుకు రా తిరుగుతున్నావ్..నువ్వంటే నాకు ఇష్టం లేదు..నిన్ను లవ్ చేయట్లేదు అని చెప్పాగా..అసలు నువ్వు నీ మొహం అద్దంలో చూసుకొంటావా ఏమన్నా బాగుంటావా నీకు నేను కావాలా…ఇంకోసారి నన్ను follow అయితే మాత్రం నీకు రాఖీ కట్టేస్తా..కాదు అని ఇంకా తిరిగావో పోలీస్ complaint ఇస్తా జాగ్రత్త అంటుంది. ఆ అబ్బాయి తనకు నామీద ఏ feelings లేవు అనుకొని ఆ అమ్మాయి అన్న మాటలకు చాలా బాధ పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కేవలం ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాడు బాగాలేడు అన్న మాటలకి పాపం ప్రాణంగా ప్రేమించిన వాడి ప్రేమను reject చేసింది.

  ఆ రోజు నుంచి వాడు ఆ అమ్మాయి వెనకాల తిరగటం ఆపేసాడు…

  కొన్ని సంవత్సరాల తరువాత ఆ అమ్మాయికి ఒక అందమైన అబ్బాయితో marriage అయ్యింది..కాని తనని సరిగా చూసుకోడు..రోజూ గొడవలు..లైఫ్ లో happyness లేదు.ఒకరోజు ఆ అమ్మాయి shopping కి వెళ్లి వస్తుంటే తనని ప్రేమించిన అబ్బాయి sudden గా ఒక కారులో నుంచి దిగుతూ కనిపిస్తాడు..మంచి personality…జాబ్ తో గుడ్ position లో ఉన్నాడు.అప్పుడు ఆ క్షణం వాడిని చూసి తన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి..మనసులో భరించలేని చాలా బాధ. నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడి ప్రేమను మా ఫ్రెండ్స్ అన్న మాటలకు వొదిలేసి నా జీవితాన్ని spoil చేసుకొన్నా అని…

  Note:-
  ఒకరు ఎదో అన్నారు అని ఆ మాటలకు మనకు నచ్చిన వాళ్ళను వదులు కోవడం చాలా పెద్ద తప్పు..నీ లైఫ్ లో నువ్వు హ్యాపీగా ఉంటావు కాని అన్నవాళ్ళు హ్యాపీగా ఉండరు…అందం అనేది ఈ రోజు ఉండచ్చు..కొద్దిరోజులకి పోవచ్చు..శాశ్వతంగా మనతో ఉండదు…కాని ప్రేమించే మనసు నువ్వు ఎలా ఉన్నా అది నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటుంది….

  నిజమైనా ప్రేమకు అందంతో పనిలేదు….ప్రాణంగా ప్రేమించే ఇంకో హృదయాన్ని కోరుకోవటం తప్పా…….

Comments are closed.