దీపావళి పండగ చరిత్ర: About Diwali in Telugu

About Diwali / Deepavali Festival in Telugu:

About Deepavali in Telugu

భారతీయులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి. ఈ పండుగ ప్రతీ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వస్తుంది. మూడు నుండి ఐదు రోజుల పాటు కుల, మత బేధం లేకుండా సంబరాలతో జరుపుకునే ఈ పండుగ హిందువులకు ప్రధాన పండుగ. చీకటిని పారద్రోలుతూ వచ్చే వెలుగుకి, చెడు పై గెలిచిన మంచికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.

దీపావళి పండగను ఎందుకు జరుపుకుంటాము?

ఇంటి లోపలా, బయటా దీపాలతో వెలుగుని నింపి, తీపి పదార్థాలు వండుకుతిని టపాసులు పేల్చుతూ సంబరంగా జరుపుకునే ప్రధాన పండుగ దీపావళి. ఈ పండుగ ఎలా వచ్చింది అన్న విషయంలో ఎన్నో పౌరాణిక కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి. కథ ఏదైనా వాటిలోని అన్ని కథల  చివరి సారాంశం దాదాపు ఒకటే… మంచి చెడును చీల్చి చెండాడి చీకటిని పారద్రోలి, విజయంతో వెలుగులు విరజిమ్ముతూ వచ్చింది అని!

రాజుల కాలంలో ఒక రాజ్యానికి మరో రాజ్యానికి మధ్యలో తరచూ (లేదా అపుడపుడు) యుద్దాలు జరిగేవి. ఇరు రాజ్యాల మధ్య యుద్ధం అనంతరం ఫలితాలు ఎంతో దారుణంగా ఉండేవి. కొన్ని కొన్ని సందర్భాలలో ఉదాహరణకు ఏ అనే ఓ మంచి సంపన్న రాజ్యం పై బి అనే స్వార్థం, రాజ్య కాంక్ష కలిగిన రాజ్యం గెలిస్తే దాని ఫలితంగా ఏ అనే రాజ్యం పూర్తి ఉనికిని కోల్పోయేది. ఒకవేళ ఏ రాజ్యమే బి పై గెలిస్తే బి అనే రాజ్యం ఏ రాజ్యం చే పాలించబడేది. ఇలా యుద్దానంతర ఫలితాలు భిన్నంగా యుద్ధంలో గెలిచిన వారి గుణం, తత్త్వం, పరిస్థితులు మొదలగు వాటిని బట్టి ఉండేవి. యుద్ధం అనేది ఎంత భయంకరమైనదో దాని పర్యావనసాలు కొన్ని సార్లు అంతే భయంకరంగా ఉండేవి. 

అలా ఓ రాజ్యం పై మరో రాజ్యం గెలిచినప్పుడు.. గెలిచిన రాజ్య యుద్ధవీరులు ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి… తమ గెలుపు సందర్బంగా తీపి వంటకాలు చేసుకుని, తమ గెలుపును చెడు పై మంచి గెలుపులా భావించి విజయానికి ప్రతీకగా దీపాలను వెలిగించి తమ గెలుపుని నలుమూలలా అందరికీ తెలిసేలా బాణాసంచాలు పేల్చేవారు. యుద్ధం నుండి యే  రోజున వచ్చిన వారు ఆ రోజుననే అంటే మొదటి రోజు వచ్చినవారు మొదటి రోజు, మరుసటి రోజు వచ్చినవారు మరుసటి రోజు, మూడవరోజు వచ్చిన వారు మూడో రోజు… ఇలా ఏ రోజు వచ్చిన వారికి ఆ రోజే పండుగ. అందుకే మూడు నుండి ఐదు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఒక్కో రోజు ఒక్కో వర్గం వారు ఒక్కోవిధంగా జరుపుకుంటారు.

అలా యుద్ధంలో గెలిచి ఇంటికి వచ్చి తమ గెలుపు అందరికి తెలిసేలా ఈ పండుగను సంబరంగా జరుపుకునే వారు. అలా వచ్చిన పండుగే ఈ దీపావళి అని అంటారు. 

దీపావళి అంటే ఏమిటి?

దీపాలను మన ఇళ్లల్లో, ఆరుబయట ఓ వరసలో ఒకదాని తరువాత ఒకటి ఒక క్రమంలో పెట్టి వెలిగిస్తాం. ఇలా వెలిగించిన దీపాల వరుస (ఆవలి)నే దీపావళి అంటారు. అలా దీప, ఆవలి పదాల నుండి  వచ్చిందే దీపావళి.   

దీపావళి పండగ రోజు ఏం చేస్తారు?

దసరా తరవాత వచ్చే అతి పెద్ద పండగ దీపావళి. దీపావళి కి రెండు మూడు రోజుల ముందు నుండే ఇంటిని పరిశుభ్రం చేయడం ప్రారంభిస్తారు. అలాగే ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. పండగ నాడు స్నానాలు చేసి వాకిళ్ళలో కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి గుమ్మాలకు తోరణాలు కట్టి తీపి పదార్థాలు చేసుకుంటారు. దీపావళి నాడు చక్కర, పాలు, నెయ్యితో చేసిన సేమియా పాయసం తప్పనిసరిగా చేసుకుని ఇంటిల్లిపాది తింటారు. చేసుకున్న తీపి పదార్థాలు కుటుంబసబ్యులకు, బంధువులకు, మిత్రులకు ఇస్తారు. సాయంత్రం ఇంట్లో, బయట మట్టి దీపాలు వెలిగించి పూజ చేస్తారు. అనంతరం టపాసులు కాల్చుతారు.

Also Check: