స్వాగతం – కవిత

రోజులు కదిలాయి

ఏళ్ళు గడిచాయి

ఆలోచనలు మారాయి

కొత్తకొత్త ఊహలతో

నవీన భావాలతో

కదులుతున్న సమయాన్ని

ఓ కలం కదలిక

కాగితంలో బంధించి

శుభ గడియల్ని ఆహ్వానించి

మంచికి స్వాగతం పలికి

చెడుని పారద్రోలి

మార్పుని నీతో ఆరంభించి

సమాజంతో అంతం చెయ్యి

నూతన సంవత్సరానికి 

స్వాగతం పలుకుదాం

విజయవంతంగా సాగిద్దాం