రక్షణ – కవిత

మాటలు రాని మౌనమా..

మంచు కురిసే కాలమా..

పసిడి వన్నె ప్రాయమా..

అదుపు లేని ఆత్రమా..

ఎందుకమ్మా  ఈ రోదనా..

అంతు లేని సంద్రమా..

అర్థమే లేని కోపమా..

అందమైన ప్రశాంతమా..

మధురమైన గాత్రమా. .

ఏమిటమ్మా ఈ వేదనా..

అలుపెరగని ఆవేశమా. 

అమావాస్య గ్రహణమా..

అనురాగపు ఆరాటమా..

అనాధ ఆశయమా..

ఎక్కడమ్మా నీ ప్రేరణా..

సల సల మరిగే రక్తమా..

ఎర్రగ మారిన నేత్రమా..

మర్మం తెలియని మూర్ఖమా..

ఆయువు పోసిన ప్రాణమా..

ఎప్పుడమ్మా నీ రక్షణా..

1 thought on “రక్షణ – కవిత”

Comments are closed.