పగడపు దీవులు – కవిత

నువ్వింత మాయల మరాఠివని తెలియదు

లేకపోతే నా మనసుని నీకైనా తెలియని

ఏ ఒంటిస్థంభం మేడలోనో

సప్తసముద్రాలకు ఆవలనో

పగడపు దీవుల లోతుల్లోనో దాచేద్దును..

నీ చూపులలో చిక్కుకుని

మాటల్లో మునిగిపోయి

నీ ధ్యాసలో కూరుకు పోయుండను

ఇలా నన్ను నేను పోగొట్టుకుని

తెల్ల మబ్బు నీడలలో

నీలాకాశపు అంచులలో

నక్షత్రాల వెలుగులలో

నా కోసం నేను వెతుకుతూ ఉండక పోదును