దాంపత్యం – కవిత

పసితనానికి పదహారేళ్ళు నిండితే యవ్వనం…

అందమైన ఆ రూపానికి చేసేరు పరిణయం…

పాలబుగ్గల పసిదాన్ని కమలహస్తం…

పాలలో ముంచి ఇచ్చేరు కన్యాదానం…

పుట్టింటి పేరే అవుతుండగా ఒక జ్ఞాపకం…

ముచ్చటగా ఏర్పడెను మూడు ముడ్ల బంధం…

ఏడడుగులు వేసే ఆ తీపి దృశ్యం…

కాదా రమ్యమైనది మన సంప్రదాయం…

సంతోషం బాధ కలగలిసిన ఆ క్షణం…

మదిలో మెదిలేను ఒక జీవితకాలం…

కష్టాన్ని ఇష్టంగా మారుస్తుంది దాంపత్యం…

ఒకరికొకరు తోడవుతారు అనునిత్యం…

ఒకరికోసం ఒకరాయ్యే తీపి అనుబంధం…

నవ వసంతాలు వికసింపజేసేదే దాంపత్యం…