చిరునవ్వు వెనుక… – కవిత

కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక కనబడని ఎన్నో కన్నీళ్లు 

చెప్పలేనంత బాధ 

దాచలేనంత దుఃఖం 

కన్నీళ్లతో నిండిన కనులు 

భారంతో నిండిన హృదయాలు 

ప్రేమించటం మరిచిన అయినవాళ్లు 

కన్నవాళ్లనే మరిచిన కసాయివాళ్ళు 

బాధని ఎవరితో పంచుకోవాలో తెలియక 

బాధ పెట్టిన వారిని ఎదిరించలేక 

దూరమైన వారి గురుంచి దుఃఖిస్తూ 

మరిచిపోతున్న వారి గురించి పరితపిస్తూ 

మాటలు నేర్చుకున్న వారితో మాట్లాడలేక 

నడకలు నేర్చుకున్న వారిని అందుకోలేక 

ఆకలి తీర్చిన వారికీ అనవసరమై

ప్రేమతో పెంచిన వారికీ పనికిరాని వారమై

పాత జ్ఞాపకాలను తలుచుకుంటు 

కన్నబిడ్డల గురుంచి ఆలోచిస్తూవుంటూ 

ఏనాటికైనా వారితో ఉండాలని 

ప్రేమగా వారి మద్య గడపాలని 

ప్రతిక్షణం ఆశతో బ్రతుకుతున్న 

అనుక్షణం నిరాశే మిగులుతున్న 

అందరూ వున్నా అనాధలై 

వృద్దాశ్రమే వారి జీవనమై 

బ్రతుకుతున్న ఎన్నో హృదయాల బాధ 

నా ఈ చిన్న కవిత…..