చెల్లి – కవిత

చిరునవ్వుల చిట్టి చెల్లి మదిలో వెలిగే జాబిల్లి

మళ్ళీ పుట్టిన మా తల్లి మాలో సంతోషం వెదజల్లి

ప్రేమానురాగాల వరములు ఇచ్చేటి కల్పవల్లి

అమాయకపు పసిడి హృదయం కలిగిన సిరివల్లి

మరక అంటని మాణిక్యమై వికసించే మరుమల్లి

అన్నయ కొరకు దెైవం పంపిన బహుమానం చెల్లి

2 thoughts on “చెల్లి – కవిత”

Comments are closed.