ఆడదానివి నువ్వు – కవిత

జన్మని ఇచ్చే తల్లివి నువ్వు!

ఫూజించే దైవానివి నువ్వు!

ఆదరించే ఆది శక్తివి నువ్వు!

అపురూపంగా కళ్ళలో పెట్టుకుని చూసుకునే అమ్మవి నువ్వు!

ఏదైనా త్యాగం చేయగల అక్క వి నువ్వు!

ఆట పట్టించే చెల్లి వి నువ్వు!

ఎంతటి బాధనైనా భరించే ఓపిక నువ్వు!

ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదురుకోగల ధైర్యం నువ్వు!

దేవుడు సృస్టించిన అద్భుతం నువ్వు!

గుర్తింపు ఉన్న పవిత్రత నువ్వు!

ఫుట్టిల్లు వదిలి మెట్టినిల్లు వెళ్ళే త్యాగం నువ్వు!

యుద్ధాన్ని ఆపగల మరియు సృష్టించగల కదలిక నువ్వు!

ప్రపంచం లో అన్నిటి కంటే అందం నువ్వు!

యే తరానికి కూడా అర్ధం కాని చిక్కు వి నువ్వు!

అన్యాయం జరిగితే అవతరించే దుర్గా రూపం నువ్వు!

మెట్టినింటి మహాలక్ష్మి వి నువ్వు!

తల్లిదండ్రుల ఆస్తి నువ్వు!

తోడ పుట్టిన వారి స్ఫూర్తి నువ్వు!

భర్త సర్వం నువ్వు!

పిల్లల ప్రేమ నువ్వు!

ప్రపంచమే నీలో నింపుకున్న కారణం నువ్వు!

మొదలూ నువ్వు! అంతమూ నువ్వు!

వెలుగులో నువ్వు! చీకటిలో నువ్వు!

ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన జీవన జ్యోతి నువ్వు!

‘ఆడదానివి నువ్వు!!!’