యువత ఎటు వెళుతోంది.. – కవిత

యువత ఎటువెళుతోది…

భారత భవిత ఏమౌతోంది….

స్వతంత్ర భారతం కన్నీరు పెడుతోంది…..

సుశ్యామల సమాజం సమస్య అయ్యింది….

కలల ప్రపంచం కనుమరుగయ్యేను..

కరుణ త్యాగం కలతచెందెను..

దయదానగుణాలు దూరమాయెను…

నీతీ నిజాయితీ మంటకలిసెను…

ఓర్పు నేర్పు సహనం మరణమాయెను..

నేటి విజ్ఞానం అజ్ఞానమయ్యింది……

ప్రేమాప్యాయతలే…మాయమయ్యాయి….

గౌరవాభిమానాలే భారమయ్యాయి….

ధనదారుణాలే దగ్గరయ్యాయి…..

బంధానుబంధాలు బాధపడ్డాయి….

నిస్సహాయ విషాదం నెలకొంది…..

అవినీతి అపకారం ఆటంకమయ్యింది….

అనాధ ఆశయం ఆశ పడుతోంది….

ఆకలి కేకలు వేస్తూ ఘోష వినిపిస్తుంది…..

చెడుముందు మంచి ఓడిపోతుంది……

మనిషికి మనిషికి మధ్య ఏమొచ్చింది…

కులమనే పిచ్చొచ్చింది…. 

బంధాన్ని తరిమేసింది…

అనురాగాన్ని చెరిపేసింది…

మతమనేమాయ వివక్ష వచ్చి కూర్చుంది…..

ఆత్మీయతని చంపేసింది…

అవినీతిని పెంచేసింది…..

ఆధునికత మేలుకోవాలి..

అభివృద్ధిని కోరుకోవాలి…

సాంకేతిక తా తరం రావాలనీ…

నవయువతా యుగం కావాలనీ..

స్వతంత్ర భారతం కన్నీరు పెడుతోంది…

మన జన్మ ప్రదేశం కోరుతోంది…