తొలిచూపు మాయ! – కవిత

కలవరమాయే .. కల నిజమాయే…

కనులు కనులు .. కలసి ఒకటాయే .

శ్వాసే మరచే.. ఊసే కలిసే..

మొదటి చూపుకే … ప్రేమే తెలిసే ..

ఏమిదీ.. ఏమ్మాయిదీ.. ఎందుకో.. ఏమిటో.. తెలియకున్నది..

                                                            || కలవరమాయే ||

నాలుగు కన్నులు కలిసి .. ఒకటే చూపుగ మారి ..

రెండు హృదయాలు .. ఒకే మనసుగా .. అవతరించెనీ బంధం ..

నవ్వులతో మురిపించి.. మనసంతా కవ్వించి ..

ఒకే బాటలో నడిచి .. ఒకే మాటపై నిలిచి .. ఒకటై పోయెనే భావం ..

నేను అంటే .. ఇక .. “నేను” “నువ్వు” అని చెప్పెనే కొత్త అర్థం ..

                                                            || కలవరమాయే ||