పాము-ఎలుక – నీతి కథ

          ఒక ఊరిలో ఒక పాములు పట్టేవాడు ఉంటాడు. పాములను ఆడించుకుంటూ బ్రతికేవాడు. ఒకరోజు ఆ పాములవాడికి ఎలుక దొరకడంతో ఆ ఎలుకను ఆపాముబుట్టలో వేసి తన పాముకు మంచి ఆహారం దొరికింది అని ఆనందిస్తాడు.

          పాము ఆకలిగా ఉండటంతో ఎలుకను తినడానికి ప్రయత్నించగా ఎలుక ఓ పాము రాజ నన్ను తినకు నీకు కావాలి అంటే నేను ఒక సహాయం చేస్తానంటుంది. పాము ఏంటో చెప్పు అని అడిగింది.

          నువ్వు నన్ను చంపకుండా వదిలిపెడితే నిన్ను ఈ బుట్టలో నుండి విడిపిస్తాను అంటుంది. ఏంటి నువ్వు నాతొ పరాచకాలు ఆడుతున్నవా ఇంత పెద్ద పామును నేనే వీడి చెరలో నుండి బయటపడలేకున్న ఇంత చిన్నదానివి నువ్వు ఎలా నన్ను వీడి చెరలో నుండి కాపాడుతావు నాకు ఆకలిగా ఉంది కావున నిన్ను నేను తినేస్తాను అంటుంది.

          వెంటనే ఎలుక అలాగైతే నీ ఇష్టం నువ్వు నన్ను మాత్రమే తిని వీడి చెరలోనే ఉండిపో ..ఇప్పుడు ఆకలికి తట్టుకుంటే నీకు స్వేచ్చ దొరుకుతుంది అంటుంది.

          పాము కాసేపు అలోచించి అవును నిజమే నేను  బయట పడితే ఏమైనా తినవచ్చు కావున నన్ను ఇక్కడి నుండి విడిపించు అంటుంది.

          ఎలుక ఆ బుట్టకు కన్నం వేయడంతో ఇద్దరు ఆ బుట్టలో నుండి బయటపడతారు. ఎలుక వెంటనే ఒక చిన్న రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. పాము ఎలుకను చూసి ఏమైంది  ఎలుకా బయటికి రా మనము ఇద్దరం స్నేహితులము కదా బయటికి వెళ్దాము అని పిలుస్తుంది.

          ఎలుక ఏంటి మనము స్నేహితులమా అలా ఎప్పటికి జరగదు. అప్పుడేదో నా ప్రాణాలు కాపాడుకోడానికి అలా చేశాను నువ్వు బయటపడ్డావు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది.

          పాము మనసులో ఈ ఎలుక చాలా తెలివైనది దీన్ని నేను తినలేను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కావున స్నేహమైన, శత్రుత్వమైన ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి.