ఓ చిరు ప్రేమలేఖ…….

          ఒకవైపు వేగంగా గడిచే కాలం,

          మరోవైపు తిరిగిరాకుండా తరిగే వయస్సు

          నాలో తపించే కోరికల సముద్రం…

          ఆ కోరికల తీరం నువ్వే……

          నా కలల అందం నీ నవ్వే……!

          నాకు నా మీద ఉన్న నమ్మకం కంటే నీ మీద ఉన్న ఇష్టం ఎక్కువ అని తెలిసిన క్షణం నాకు తెలిసిన నిజం నీమీద నా ప్రేమ……

          “ప్రేమ”  పలికితే ఒక్క క్షణం

          రాస్తే రెండు అక్షరాలు

          “ప్రేమిస్తూ – తీసుకుంటూ ” ఉంటే సరిపోదు ఒక జీవిత కాలం….

          నా చూపులు నిన్ను తాకిన క్షణం నువ్వు నావంక అప్రయత్నంగా చూసే చూపు నా మనసులో జరిగే సంఘర్షణ కి కారణం….అది ఎంతో మధురం…….

          నా ప్రేమలో ప్రతిరోజూ అమాయకత్వం తో పాటు స్వార్ధం కూడా పెరుగుతుంది  “నేను నీ సొంతం ” అని.ఆ స్వార్ధమైన ఊహ కూడా ఎంతో అందంగా ఉంది…..నా ప్రేమలా……నా నువ్వు లా……!

          నువ్వు నాకు ఏమని చెప్పను….ఎవరని చెప్పను…..

          నేను మరిచిన ‘ప్రేమ’ అనే పదానికి పరిపూర్ణ నిర్వచనం చూపించిన నిఘంటువువా లేక నా ఆలోచల్ని ఆకర్షించి ‘నా ప్రయాణం’   “మనం” అనే గమ్యనికి మార్చిన నా తొలిప్రేమ అని చెప్పనా !

          నా ప్రతి ఆలోచన నీ గురించే,

          నా నిన్నటి కల, రేపటి ఆశ

          అన్నీ నువ్వే ….

          నేను పొందిన వరం….. 

          నాకు దొరికిన అదృష్టం……

          నువ్వే

          నేను వ్రాసే పదాల సమూహం కాదు నా ప్రేమ…..

          జరిగిన సంఘటనల వెనక దాగిన నిజం నా ప్రేమ……

          నాకు నీ మీద ఉన్న ఇష్టం మనిద్దరిని స్నేహితులు గా ఒకరిని ఒకరికి పరిచయం చేసింది.

          మన ఇద్దరి మద్య ఉన్న స్నేహం నాకు నీ మీద నీ ప్రేమను పరిచయం చేసింది.

          నీ సంతోషం నా గెలుపు……

          నీ గెలుపు నాకు ఆనందం….

          అబద్ధం, ద్వేషం అసూయపడే అందమైన నిజం నా ప్రేమ.

          నీ ప్రేమలో తపిస్తున్న నేను నీ కోపాన్ని సహించగలను,

          నీతో నా బాధను పంచుకోగలను కానీ

          నీ దూరాన్ని భరించలేను.

          చివరికి నా ఆత్మ తాను ధరించిన దుస్తులైన ఈ దేహం వీడితే ఆనంతవాయువుల్లో కలిసేది నా ప్రాణమే కానీ నా ప్రేమ కానే కాదు.

          నీ సమాధానం కోసం నిరిక్షీస్తూ….

          నీ ప్రేమకై……..

                      – రవితేజ

2 thoughts on “ఓ చిరు ప్రేమలేఖ…….”

 1. ప్రియా… నీ… కంటిరెప్పను నేనన్నావు
  కన్నీరులచేజరవు………
  వర్షపుమబ్బుల వెంటోస్తానన్నావు
  వర్షంలా కరిగిపోయావు……..
  నా నీడలా నవేంటే ఉంటానన్నావు
  ఆ నీడలాగే మిగిలిపోయావు……..
  మళ్లీ తిరిగి ఎప్పుడు వస్తావు ఓ ప్రియురాలా……
  “”””నువు వస్తావని”””
  నీ… ప్రేమకై ఎదురుచూస్తూ
  నీ… ప్రేమికుడు “అజయ్” (చిన్నీ)

 2. నాలో ఈ ప్రతీ కదలికకు, నేను ఇలా ఉండడానికి నువ్వే ప్రధాన కారణం.
  నేను నీ వల్లే ఇలా ఉన్నాను.
  ప్రేమ అనే పదానికి నువ్వొక కొత్త నిర్వచనం.

  ప్రేమతో నీ మహిధర్.

Comments are closed.