నేటి చదువులు – కవిత

చదువు చదువు

కళ్ళు తెరిస్తే “చదువు”

కళ్ళు మూస్తే “చదువు”

బడిలో చదువు

ఇంటికి రాగానే ట్యూషన్

బండెడు హోమ్ వర్క్

ఎక్కడున్నది చిట్టి మెదళ్ళకు హాలిడే

బడిలో గంటల కొద్దీ పాఠాలు

పూట పూటకు పరీక్షలు

ప్రాజెక్టు రిపోర్టులు

వీపు మీద బ్యాగ్ మోతలు

ర్యాంకులు పడి పోతే శిక్షలు

ర్యాంకులు విజ్ఞానానికి కొలమానాలా

విద్యార్థుల లో ప్రతిభ/సృజనను

వెలుగులో కి తెచ్చే విధానం కావాలి

విద్యార్థి ప్రతిభకు పట్టం కట్టాలి