నీతి పంచకము

1. ఒప్పు లెన్నువారెవరు…??

ఒప్పు లెన్నువారు ఓరిమి నెలరేడు

ఉర్వి జనుల కెల్ల నొక్కడుండు

మంచి ఎన్ను వారి మది గెల్వవలెనయ

వినర వినర నాదు వినతి నేడు.

2. దోమ పలుకులు:

దోమ దోమ యనుచు ధూమములను బెట్టి

గడప బయట గెంట గర్వ ముడిగె 

నాటి కర్మ ఫలము నేటికి కలిగెనొ

వినర వినర నాదు వినతి నేడు.

3. చేప పలుకులు:

నాడు అసురు జంపి వేదాల రక్షింప

నాదు జన్మ మెత్తె నారి ధరుడు

నేడు కడుపు నింపె నేటినా జన్మము 

వినర వినర నాదు వినతి నేడు.

4. ఎండవాన లెక్కడ కురియు?

ఇక్కడక్కడనక ఎండ వాన కురియు

సర్వ జీవులకును సమము శివుడు

ఆత్మశుద్ది గాక అవగతం కాబోదు

వినర వినర నాదు వినతి నేడు.

5. నరుని కేమి తెలియు..?

తెలిసె తెలిసె ననుచు తెలివి మీరగ బోవ 

మేరు నగము కాదె నరుని అహము!

లోన నుండు ఆత్మ కనుగొన లేడాయె

వినర వినర నాదు వినతి నేడు.

1 thought on “నీతి పంచకము”

Comments are closed.