ముందుమాట | 7-2017

          అందరికీ మా నమస్కారాలు,

          జులై మనందరి మాసపత్రిక సంచికతో బాటు మనందరి.కామ్ లో ఒక విభాగంగా కొనసాగుతున్న తెలుగు విభాగాన్ని పూర్తి తెలుగు వెబ్సైటుగా వెబ్ తెలుగు ఖతి(ఫాంట్)లో తీసుకువచ్చాము. గత సంచికలో పాఠకులతో మేము పంచుకున్న భావాల్లో ‘అచ్చు పత్రికలకు సమానంగా అంతర్జాలంలో మనందరి మాస పత్రికను తేవాలని మా ప్రయత్నం’ అని తెలిపాము. కానీ సమయం వెచ్చించలేకపోతున్నాము. సమయం తీసుకుని చేయాలనే ఎప్పుడూ  భావించే వాళ్ళం. కానీ పరిస్థితులు అనుకూలించక రచనల ప్రచురణ ఆలస్యం అయిపోతోంది. రచయితల నుండి కూడా త్వరగా రచనలను ప్రచురించమని పదే పదే వినతులు వస్తున్నాయి. అందుకే మా ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఈ విధంగా వెబ్ తెలుగు ఖతిలో పూర్తి తెలుగు వెబ్సైటును తీసుకు రావడం జరిగినది.  

          అందరూ మనందరి తెలుగు వెబ్సైటును ఎప్పట్లాగ కంటే ఇంకా ఎక్కువగా ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

నిర్వహకులు, సంపాదకులు

పద్మశ్రీ, బి.అఖిల్ కుమార్

(సోదరి, సోదరుడు)