లే… లేయ్ రా… లే – 2 – కవిత

లే

లెయ్ రా లే

కొండలను పిండి చేసే దమ్ము లేదా

సమస్యతో పోరాడే సత్తా లేదా

బతకడానికి కావలసిన ధైర్యం లేదా

సాధించడానికి కావలసిన పట్టుదల లేదా

నీవు చేసే పనిలో నిజాయితీ లేదా

ప్రపంచాన్ని ఎదిరించే ఆత్మవిశ్వాసం లేదా

లెయ్ రా లే

సమస్యల వెనుక పరుగులెట్టక

సమాధానాల బరిలో ఉరకలు వేస్తూ

జగమెరిగిన సమరంలో     

అలుపెరగని యోధుడిగా

విజయ ఢంకా నాదాన్ని మ్రోగించేవరకు

దూసుకెళ్ళరా ముందుకు

దూసుకెళ్ళరా ముందుకు