House lizard falls on body And Its Results In Telugu – English – Hindi

బల్లుల వల్ల కలిగే మంచి మరియు చెడు ఫలితాలు

చిన్నప్పటి నుండి కూడా, బల్లులను చూస్తే నాకు ఒకలాంటి అసహ్యమైన భావన. అంతే కాదు, వాటిని చూసి నేను భయపడతాను కూడా.

కానీ, బల్లులు ఇంట్లో ఉండి, మనుషులకు మేలే చేస్తాయి. ఎలా అంటే అవి దోమలను, సాలీడులను, చిన్న చిన్న పురుగులను, బొద్దింకలను, ఇంకా చాలా వాటిని తిని ఇల్లుని శుభ్రపరుస్తాయి.

బల్లుల గురించి బల్లి శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్రాలలో, అవి శరీరం మీద ఎక్కడ పడితే మంచి, ఎక్కడ పడితే చెడు జరుగుతుందో ఉంటుంది. కానీ నేను కేవలం బల్లులు, అవి మన మీద పడితే ఏం అవుతుంది అనే వాటి మీద మాత్రమే నా అభిప్రాయం గురించి చెప్పాలనుకుంటున్నాను.

ముందుగా, బల్లుల గురించి కొన్ని విషయాలు అంటే అవి ఎక్కడెక్కడ తిరుగుతాయో చెప్తాను. నేను వాటిని చెత్తకుప్పలలో, పెంటలలో, డ్రైనేజీలలో, పాడుబడిన కట్టడాల్లో, హాస్పిటల్లో ఉండే చెత్త ప్రదేశాలలో, ఇంకా చాలా మురికి ప్రదేశాలలో తిరుగటం చూశాను. మళ్ళీ అవి ఇళ్ళల్లోకి వస్తాయి. అవి ఇళ్ళల్లోకి వచ్చి ఒక మూలన ఉంటాయా? ఉండవు. ఇల్లంతా తిరుగుతాయి. నా అభిప్రాయం ప్రకారం అవి చాలా ప్రదేశాలలలో తిరిగేటప్పుడు, చాలా రోగ కారక క్రిములు, బాక్టీరియాలు వాటి శరీరం మీదకు చేరుకుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే బల్లులు రోగాలను తీసుకొచ్చే వాహకాలుగా పనిచేస్తాయి.

బల్లులు ఇలాంటి ప్రదేశాలలో తిరిగి ఇంట్లోకి వచ్చినపుడు, పొరబాటున మనిషి శరీరంపైన పడితే, ఆ బాక్టీరియా, క్రిములు మనిషి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలా అని బల్లులు మనిషి పై పడగానే రోగాలు వచ్చి చచ్చిపోతాడు అని నేను చెప్పడం లేదు. రోగాలు వస్తాయా రాదా అనేది మనిషి రోగ నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి, బల్లులు మనిషి శరీరం పైన పడినప్పుడు, అది పడిన చోటుని శుభ్రపరుచుకోవాలి లేదా స్నానం చేయాలి. అంతే కాదు నా అభిప్రాయం ప్రకారం, ఎవరికైతే చాలా తక్కువ రోగ నిరోధక శక్తి ఉంటుందో వారు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు జాగ్రత్తగా మందులు తీసుకోవడం మంచిది.

రాసిన వారు : పద్మశ్రీ

Good and bad results caused by house lizards

Since childhood, seeing lizards gives me a kind of unpleasant feeling. And even now, I get scared of them.

But lizards stay at home and do well to humans. How they do well? They clean the house by eating mosquitoes, spiders, small insects, small cockroaches and many more.

There is lizard astrology about lizards. It says about what happens when the lizard falls on the body. But I just want to give my opinion on the lizards and what would happen if they fell on us.

First, let me tell you a few things about lizards and where they roam. I have seen them roaming around in garbage dumps, farms, drainages, abandoned buildings, hospital garbage, and many other dirty places. Again they come into the houses. Do they come into houses and stay in a corner? No. They crawl all over the house. In my opinion, when lizards move around a lot of dirty places, a lot of germs and bacteria get over on their body. In a sense, lizards act as carriers of diseases.

When the lizards come back into the house from such places, if they fall on the human body by mistake, those bacteria and germs have a chance to enter the human body. I am not saying that when lizards fall on humans, they will get sick and die. In my opinion, it depends on the immune system of the person to get diseases or not. So, when a lizard falls on a human body, the place where it fell should be cleaned or bathed. Not only that, in my opinion, anyone who has a very low immune system should consult a good doctor and take the medication carefully first.

Written by Padmasri

छिपकलियों से होने वाले शुभ-अशुभ फल |

छोटी उम्र से ही छिपकलियों को देखकर मुझे एक तरह की घिनौनी अनुभूति होती थी। इतना ही नहीं, मुझे उनसे डर भी लगती है|

लेकिन, छिपकलियां घर में ही रहती हैं और इंसानों के लिए अच्छी करती हैं। कैसे वे मच्छरों, मकड़ियों, छोटे कीड़े, तिलचट्टे और बहुत कुछ खाकर घर को साफ करते हैं।

छिपकलियों के बारे में छिपकली ज्योतिष है। इसमें बताया गया है कि जब छिपकली शरीर पर गिरती है तो क्या होता है। लेकिन मैं सिर्फ छिपकलियों और अगर वे हमारे ऊपर गिर गईं तो क्या होगा पर अपनी राय देना चाहती हूं ।

सबसे पहले, मैं आपको छिपकलियों के और वे कहां घूमती हैं बारे में कुछ बातें बताऊँगी । मैंने उन्हें कूड़े के ढेरों, खेतों, नालों, परित्यक्त इमारतों, अस्पताल के कचरे और कई अन्य गंदे स्थानों पर घूमते देखी है। वे फिर घरों में आ जाते हैं। क्या वे घरों में आकर एक कोने में बैठे रहते हैं? नहीं, वे पूरे घर में घूमते रहते हैं। मेरी राय में, जब छिपकलियां बहुत गंदी जगहों पर भटकते हैं, तो उनके शरीर पर बहुत सारे कीटाणु और बैक्टीरिया लग जाते हैं। एक तरह से छिपकलियां बीमारियों के वाहक के रूप में काम करती हैं।

ऐसी जगहों से छिपकलियां घर में आ जाती हैं और अगर गलती से इंसान के शरीर पर गिर जाएं तो बैक्टीरिया और कीटाणु इंसान के शरीर में प्रवेश कर सकते हैं। मैं यह नहीं कह रही हूं कि जब छिपकलियां इंसानों पर गिरेंगी तो वे बीमार पड़ जाएंगे और मर जाएंगे। मेरी राय में रोग होना या न होना व्यक्ति की रोग प्रतिरोधक क्षमता पर निर्भर करता है। इसलिए जब छिपकली किसी इंसान के शरीर पर गिरती है तो जिस स्थान पर छिपकली गिरी हो उस स्थान को साफ कर लेना चाहिए या स्नान कर लेना चाहिए। इतना ही नहीं, मेरी राय में जिस किसी की भी रोग प्रतिरोधक क्षमता बहुत कम है, उसे पहले किसी अच्छे डॉक्टर से सलाह लेनी चाहिए और सावधानी से दवा लेनी चाहिए।

लेखिका : पद्मश्री