దీపావళి – కవిత

పండగై వచ్చింది దీపావళి…

జ్యోతులతో వెలిగింది ప్రతి వాకిలి…

చీకటిని చీల్చేను దీపావళి

సంపదతో వెలగాలి ప్రతి లోగిలి

దివ్వెల వెలుగులు వరుసగా వెలుగగా..

మనసున మెలిగిన పాపమూ తొలుగగా…

పున్నమి వెలుగులు జ్ఞాప్తికి రాగా…

అమావాస్య రేయి రూపం మారగా…

దుష్టసంహారం చేయ కృష్ణుడు పూనగా…

భామా విజయం జ్ఞాప్తికి రాగా…

చిరుదివ్వెలతో చిరునవ్వులు జత కాగా…

మహాలక్ష్మిని ఇంటింట ఆహ్వానించగా…

తీపి జ్ఞాపకాలని జ్ఞాప్తికి తెస్తూ….

తీయ తీయని రుచులను ఆస్వాదిస్తూ…

కాంతులు విరజిమ్మే దీపావళి…

ఆకాశాన వెలుగుల ఆరావళి.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు