చిరునవ్వుల చిరునామా – కవిత

చిరునవ్వులకే చిరునామా

చిన్నారుల నవ్వుల్లో స్వచ్ఛత

వాళ్ళ కళ్ళలో పవిత్రత

సరస్వతి ఒడి నుంచి 

అమ్మ ఒడికి చేరాలని

అమ్మ ఒడిలో సేద తీరాలని

అమ్మ చేతి గోరుముద్దలు తినాలని

పసి మనసుల్లో ఎన్నో ఊహలు

ఆ ఊహల సౌధం కూల్చేస్తూ

స్కూల్ బస్సు లోయలోకి దూసుకెల్తూ

మరణ మృదంగం మోగిస్తూ

పసి ప్రాణాలు గాలిలో కలిపేస్తూ

తల్లిదండ్రుల గుండెల్లో మంటలు రగిలిస్తూ

విధికి ఎంత క్రూరత్వం

విధికి లేదు దయా దాక్షిణ్యం