చెమట ఎక్కువగా పట్టటము- శరీర చెడు వాసనను ఎలా అరికట్టటము? – వ్యాసం

          చెమట పట్టటము అనేది మన శరీరములోనే కాదు జీవులన్నిటీలో జరిగే సాధారణ ప్రక్రియ. చెమట పట్టటము ద్వారా మన శరీరములోని మలినాలు చర్మము ద్వారా విసర్జించబడతాయి. చెమట పట్టటం ఎక్కువ తక్కువ అనేది మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్తుతులను బట్టి, శరీరతత్వాన్ని బట్టి మారుతూ  ఉంటుంది. ఎక్కువగా శారీరక శ్రమచేసిన ఎండలు ఎక్కువగా ఉన్నా చెమట ఎక్కువగా పడుతుంది ఈ విధముగా చెమట పట్టటం అనేది మన శరీర ఉష్ణోగ్రత ను క్రమపరచటానికి మన శరీరము అవలంభించే సహజ ప్రక్రియ. కొంతమంది కి చెమట ఎక్కువగా పడుతుంది అటువంటి వారు అది ఏమైనా అసాధారణ ప్రక్రియా దానికి పరిష్కారము ఏమిటి అనే విషయము తెలుకోవటానికి ముందు చెమట పట్టటం గురించి కొన్ని విషయాలను గురించి తెలుసుకోవాలి.1. చెమట పట్టటం శరీరములో జరిగే ఒక సహజ ప్రక్రియ:- చెమట పట్టటం అనేది శరీరము నిత్యము నిర్వర్తించే ఒక ముఖ్యమైన పని అని మనము తెలుసుకోవాలి. మన చర్మము లోని స్వేదగ్రంథులు చెమట రూపములో కొన్ని ద్రవాలను బయటికి పంపిస్తాయి. దీనివలన మన శరీరము తన ఉష్ణోగ్రత  స్థిరముగా బయటి ఉష్ణోగ్రతలతో సంబంధము లేకుండా, ఉంచగలుగుతుంది. చెమట పట్టటం కొద్దిగా ఇబ్బందికరం అనిపించినా శరీరాన్నిచల్లబరిచే సహజ ప్రక్రియ ఇది అని తెలుసుకోవాలి  చెమట లో నీరు, కొన్నిరకాలైన చక్కెరలు, లవణాలు, అమ్మోనియా ఉంటాయి మాములుగా అయితే చెమటకు ఏవిధమైన వాసన ఉండదు కానీ చెమటలో వాతావరణములోని బ్యాక్టీరియా కలవటం వల్ల చెడు వాసన వస్తుంది. 

2. చెమట పట్టటము మనిషి మనిషికి తేడా ఉంటుంది :-   ఇతరులకన్నా మనకు ఎక్కువ చెమట పడుతుంటే అది మనకు ఆందోళన కలుగజేయవచ్చు మీరు ఇబ్బందిపడవచ్చు కానీ ఆ విషయము లో కంగారు పడవలసిన పనిలేదు ఎందుకంటే ఈ చెమట పట్టటము అందరికి ఒకేలా ఉండదు తీసుకొనే ఆహారము వాతావరణ పరిస్తుతులు శరీర పరిమాణము లాంటి అంశాలు పట్టె చెమటను నిర్ణయిస్తాయి అందువల్ల మీకు ఎక్కువ చెమట పడుతున్నా చెమట ఎక్కువ వాసన వస్తున్నా అది పూర్తిగా మీ వ్యక్తిగతము మీరు భాధ పడవలసిన పనిలేదు. 3.స్వేద గ్రంధులు ఎక్కువగా పనిచేయటము వల్ల హైపర్ హైడ్రోసిస్ అనే వ్యాధి ఏర్పడుతుంది:-  కొంతమందిలో స్వేద గ్రంధులు ఎక్కువగా చెమటను ఉత్పత్తిచేయటం వల్ల హైపర్ హైడ్రోసిస్  అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవాళ్లకు స్వేద గ్రంధులు ఓవర్ గా యాక్టివ్ గా ఉండటంవల్ల చెమట విపరీతముగా పడుతుంది. దీనికి మాములుగా చికిత్స లేదు దీనికి శాశ్వత పరిష్కారము శస్త్ర చికిత్స ద్వారా స్వేద గ్రంధులకు వచ్చే కొన్ని నాడిపోగులను కత్తిరించటమే. 

4. చెమట పట్టటము ఒక మానసిక ప్రక్రియ:-చెమట పట్టె విధానమును నిర్వహించేది నాడీవ్యవస్థలో భాగమైన సింపథటిక్ నాడీవ్యవస్థ ఈ నాడీవ్యవస్థ ఉత్తేజితమైనప్పుడు చెమట పట్టటము మొదలవుతుంది చెమట పట్టటం గురించి ఎక్కువగా ఆలోచించినా చెమట ఎక్కువగా పడుతుంది 5. వాంతి లేదా విరేచనము అయ్యేటట్లు ఉండటము :- ఇది కూడా చెమట ఎక్కువగా పట్టటానికి కారణము ఎందుకంటే వాంతి లేదా విరేచనం అయ్యేటట్లు ఉండటం వల్ల సింపథిటిక్ నాడి  వ్యవస్థ ఉత్తేజితము అవుతుంది ఫలితముగా చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. 

6. చెమట పట్టటం కొన్ని సందర్భాలలో ఆలస్యము అవ్వచ్చు :-మెట్లు ఎక్కుతున్నప్పుడు మీరు గమనిస్తే 4 అంతస్తులు ఎక్కినా చెమట పట్టకపోవటం ఆశ్చర్యము కలిగించవచ్చు ఆ తరువాత అంటే కొద్దిగా ఆలస్యముగా చెమట పడుతుంది. ఎందుకంటే మన శరీరము శరీరములో జరుగుతున్న థెర్మో రెగ్యులేషన్ కు తగ్గట్టుగా రియాక్ట్ అవటానికి  కొద్దిగా టైమ్ పడుతుంది. చెమట పట్టటం ఇబ్బందికరం అసౌకర్యము అయినా శరీరానికి చాలా ఉపయోగ మైనది. చెమట పట్టటం తప్పనిసరి చెమట వాసన చెడుగా ఉంటుంది కాబట్టి అటువంటి దుర్గంధమును నివారించటానికి కొన్ని చిట్కాలు చెపుతాను వీలయితే అవి పాటించి కొద్దిగా ఫలితాన్ని పొందండి. 

చెమట వల్ల కలిగే శరీర దుర్గంధాన్ని నివారించటము ఎలా?:- చెమట ఎక్కువగా పట్టే వేసవికాలములో వేప ఆధారిత సబ్బులతో తప్పనిసరిగా రోజుకు రెండు సార్లు స్నానము చేసిన బ్యాక్టీరియా నశిస్తుంది. స్నానము తరువాత టాల్కం పౌడర్ ను శరీరముపై పలుచగా చల్లుకోవాలి లేదా రోజ్ వాటర్ చర్మము లోకి ఇంకెలా రుద్దుకోవాలి.  రాత్రి పూట గంధాన్ని రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ ల చేసి చెమట ఎక్కువగా పట్టే చంకలలో అరిచేతిలో పాదాలలో రాయాలి. వీలు అయినంత వరకు తేలికైన వదులుగా ఉండే నూలు వస్త్రాలనే ధరించాలి. ప్రతిరోజు  శుబ్రముగా ఉతికిన పొడి బట్టలనే ధరించాలి స్నానానికి ఉపయోగించి నీటిలో కొన్ని వేప అకులను లేదా వేప బెరడును కలపాలి.ఫలితముగా నీటిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి చంకలలో పెరిగే జుట్టును తీసివేస్తు ఉండాలి చందనాది తైలముతో శరీరాన్ని మర్దన చేయాలి .

ఆహారము విషయములో పిత్త  దోషాన్ని పెంచే వాటిని తీసుకోకూడదు కాఫీ టీలు తక్కువగా తీసుకోవాలి మద్యపానానికి దూరముగా ఉండాలి వీలైతే గ్రీన్ టీ లేదా ధనియాలుతో తయారుచేసిన టీ త్రాగాలి కూరలలో దోస, కాకర, సొర, గుమ్మడి వంటివి ఎక్కువగా తినాలి. నీరు ఎక్కువగా త్రాగాలి. నిమ్మరసము కలిపినా నీరు, పుచ్చకాయలు ఎక్కువగా తీసుకోవచ్చు పిత్తదోష నివారణకు త్రిఫల చూర్ణముతో తయారుచేసిన కషాయాన్ని తీసుకోవాలి ఒక చెంచా మెంతులను రాత్రి నీటిలో నానాబెట్టి ఉదయాన ఖాళీ కడుపుతో త్రాగాలి. యోగ ప్రాణాయామము నిత్యము చేస్తు ఉండాలి లావుగా ఉంటే సన్నబడటానికి ప్రయత్నిస్తే ఫలితము ఉంటుంది 

ఈ విధముగా మంచి అరోగ్యకరమైన అలవాట్లు పద్దతులు మంచి ఆహారము ద్వారా  శరీర దుర్గంధాన్నినివారించ వచ్చు  ప్రయత్నించండి.