యువరాణి – కవిత

ఆకాశంలో అద్భుతం… నువ్వు

నా ఆలోచనలో ఆకాశం నువ్వు

నా ఊహల్లో ఉర్వశివే నువ్వు

నా కన్నుల్లో కల హంసవి నువ్వేఅద్దానికే అద్దం పట్టే అందానివా

హృదయాన్నే ప్రేమతో కట్టేసే

నా ప్రేమ యువరాణివా…?

పంపిస్తున్నా మేఘ సందేశం

ఉరుమై గర్జిస్తావో

వర్షమై కరుణిస్తావో…

చేతక పక్షిలా ని పిలుపుకై వేచి ఉంటా