ఓ పురుషుడా – తల్లీ, భార్య ఇద్దరూ సమానమే – కవిత

ఓ పురుషుడా – తల్లీ, భార్య ఇద్దరూ సమానమే - కవిత

తల్లి నీకు జన్మని ఇస్తుంది, భార్య నీకోసం జన్మేత్తుతుంది!

తల్లితో ప్రేమ దైవ దర్శనం లాంటిది, భార్యతో ప్రేమ ప్రేమ పరిచయం లాంటిది!

తల్లి నీకోసం నొప్పులు పడ్తుంది, భార్య నీ వల్ల నొప్పులు పడ్తుంది!

తల్లి నీకు కంట తడి రానీకుండా పెంచుతుంది, భార్య జీవితాంతం నిన్నే కళ్ళల్లో పెట్టుకుంటుంది!

తల్లి నీ గురించి దైవాన్ని వేడుకుంటుంది, భార్య నువ్వే తన దైవం అనుకుంటుంది!

తల్లి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అనుకుంటుంది, భార్య తన ప్రతి అడుగులో నువ్వు తోడు ఉండాలి అనుకుంటుంది!

తల్లి నీకు తన ప్రేమని పంచుతుంది, భార్య నిన్నే తన ప్రేమ అనుకుంటుంది!

తల్లి తను పూర్తయ్యి నీకు జన్మని ఇస్తుంది, భార్య నీ వల్ల పూర్తయ్యి నీ అంశానికి జన్మనిస్తుంది!

తల్లి నీ పై ఏ ప్రమాదం రాకుండా కాపాడుతుంది, భార్య అన్ని ఆపదల్లో నీకు అండగా ఉంటుంది!

తల్లి నిన్ను కనీ, పెంచి, పెద్ద చేస్తుంది; భార్య నీలో సగమై జన్మంతా నీ తోడు ఉంటుంది!

తల్లి-కొడుకుల బంధము; భార్య-భర్తల బంధము… రెండూ వదులుకోలేని పవిత్ర బంధాలు!

కాబట్టి ఓ పురుషుడా… తల్లి, భార్య ఇద్దరూ సమానమే!!!