కడలి గర్భాన పురుడు పోసుకున్న
బాల భానుడి నులివెచ్చని కిరణాలు,
పిల్ల తెమ్మెరలకు తలలూచే
పచ్చని పైరుల సయ్యాటలు,
చిరునవ్వు ల చిరునామా మేమంటూ
ప్రేమ గా పలకరించే పూబాలలు,
పూల సుగంధాలను తనలో నింపుకుని
నిలువెల్లా పరవశించే పిల్లగాలులు,
ఇన్ని అందాల నడుమ నిలువెల్లా
తడిసి ముద్దవుతూ కడలి కెరటాల
సంగీతాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ,
ప్రకృతిని చూసి పరవశించే
ఓ మనిషీ……..
నీ వికృత చేష్టల విలయతాండవంలో
తుడిచిపెట్టుకొని పోతున్న ఈ పచ్చని
ప్రకృతిని రక్షించే దిశగా నీ పయనం సాగించు.
నీ తరువాత తరాల వారికి నీవు అనుభవిస్తున్న
ఈ అందాన్ని, ఆనందాన్ని భద్రంగా అందించు…