డాబాపై రాత్రి వేళ,
నీ చేయి పట్టుకుని కూర్చుని ,
నీలాకాశంలో చుక్కలను
లెక్కించాలని ఉంది.
పెరట్లో నీ వొళ్ళో తల పెట్టుకొని
కొబ్బరాకుల మధ్య నుంచి
తొంగి చూస్తున్న జాబిల్లితో
మాట్లాడాలని ఉంది .
ఖాళీగా ఉన్న రహదారిపై
నీ భుజముపై తల వాల్చి ,
నీ ముఖాన్ని చూస్తూ
నడవాలని ఉంది.
నీ హృదయంపై నా
చెవి పెట్టి, నీ గుండె చేసే
సవ్వడి వినాలని ఉంది.
నిరీక్షణ తోనే నా
జీవిత కాలం పూర్తి అవుతున్నా,
ఇంకా నీ కోసం ఎదురు
చూడాలని ఉంది.
కోవెలలో దైవ దర్శనం తర్వాత
కోనేరు దగ్గర కూర్చుని ,
కొబ్బరి ప్రసాదం నీతో
పంచు కోవాలని ఉంది.
Naaku istamyna kavita