రాను రాను రానే రాను…..
నిలవను నిలవను నేనెప్పుడు నిలవను.
యాగాలెన్ని చేసినా, యాతనలెన్ని పడినా..
తపస్సులెన్ని చేసినా, తర్కించను నిన్నటి గూర్చి..
దుష్టులెందరు, దుష్టశక్తులెన్ని వచ్చినా,
పంతం విడవను, పయనం ఆపను…
వసంతాలెన్ని వచ్చినా, గ్రీష్మాలెన్ని వెళ్ళినా
గడిచినది గాలికి వదిలి, గమ్యం చేరుతా..
జారిపోను, జాలిపడను
దూషించను, దుఖించను
భానుడు సైతం బంధి నా పాలనలో
ప్రకృతి సైతం పాటిస్తుంది నా నియమాలు..
ప్రతి పరీక్షలో నిన్ను పరీక్షిస్తూ,
ప్రతి ప్రశ్నకు జవాబు నేనౌతా!
మరెందుకు ప్రియ నేస్తం, నన్ను మరచి
స్వల్పసౌఖ్యం కోసం, సాగనంపుతావు నన్ను…