మిస్ యు చిన్ను – ప్రేమలేఖ

మిస్ యు చిన్ను…

నీతో కలిసి బ్రతకాలనుకున్నాను… అది నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు. కాని నా ప్రేమ నిజం అందుకే నీకు దూరంగా ఉంటున్నా నా మనసు నీకు దగ్గరవ్వాలనుకున్నాను.

చిన్నప్పుడు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు అసలు ప్రేమంటే ఎలా వుంటుందో కూడా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే నువ్వు నాకు దగ్గరయితే ఇప్పటి వరకు వున్న ఒంటరితనం దూరం అవుతుంది.

చూడగానే ప్రేమ పుడుతుందో లేదో నాకు తెలియదు కాని ఒక్క సారి మనసులో పుట్టిన ప్రేమ చావులో కూడ తోడుగానే వుంటుంది, చిన్నప్పటి నుండి ప్రేమ అనే బంధానికి దూరంగా ఒంటరిగా బ్రతికాను కదా అందుకే అది నీకు అర్థం అయ్యేలా చెప్పలేకపోయను.

మనషులు దగ్గరగా వుండి మనసులు దూరంగా వుండటం కంటే మనషులు దూరంగా వుండి మనసులు దగ్గరగా వుంటే ఆ ప్రేమ ఇంకా ప్రేమగా వుంటుంది. అందుకే  నీకు దూరంగా వున్నా దగ్గరగా వున్నా నా ప్రేమ ఎప్పటికి నీతోనే వుండాలనుకుంటున్న, ఇప్పటి వరకు నాలోని ఒంటరితనాన్ని చూసిన నా కళ్ళు అవి ఇష్టపడిన నీ మనసును చూశాయి… కళ్ళతో పుట్టిన ప్రేమ మనసుతో దగ్గరవుతుంది. బాధలో అయినా సంతోషంలో అయినా నీ మనసులో నుంచి బయటకు వచ్చే ప్రతి కన్నీటి బొట్టును కూడా నా హృదయంలో దాచుకుంటా….