ఒక నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు చాలా కొమ్మలతో విస్తరించి ఉండేది. కాని దానికి గర్వం ఎక్కువ నేనే అందరికన్నాగొప్ప అని అనుకుంటూ ఉండేది. ఒక రోజు నదిలో ఉన్న చిన్న మొక్కలతో మాట్లాడుతూ మీరు నాకు రోజు తలొంచి నమస్కారం చేయాలి, ఎందుకంటే మీరు నాకన్న బలహీనమైన వారు అంటుంది. ఆ చిన్న మొక్కలు మేము నీకన్నా చిన్నవారమే కాని ఎవరి గొప్పదనము వారికి ఉంటుంది.
మేము నీకు తలొంచి నమష్కారము చేయము అంటాయి. దానికి మర్రి చెట్టు ఆగ్రహిస్తుంది. ఆలోపే ఒక్క పెద్ద గాలి రావడంతో ఆ చిన్న మొక్కలు గాలికి తలొగ్గుతాయి అది చూసిన మర్రి చెట్టు పెద్దగా నవ్వి మీరు చిన్న గాలికే నిలబడలేకపోయారు నేను చూడండి ఎంత గాలి వచ్చినా గర్వంగా తల దించకుండా నిలబడగల్గుతాను అని చెప్తుంది.
ఆ చిన్న మొక్కలు అవును మేము గాలికి భక్తితో తల దించాము నీవు కూడా గాలి దేవుడికి నమస్కరిస్తూ నీ కొమ్మలతో పలకరించు లేకపోతే తన ఆగ్రహానికి గురి అవుతావు అని అంటాయి.
లేదులేదు నేను ఎవరికీ భయపడను నేను అందరికంటే బలవంతుడిని నన్ను ఎవరు ఏమి చేయలేరు అని విర్రవీగుతుంది మర్రిచెట్టు.
ఆ లోపే గాలి పెద్దగా వీస్తుంది కాని మర్రి చెట్టు అలాగే నిలబడి ఉంటుంది. కాసేపు అయ్యాక గాలి తాకిడి ఎక్కువ కావడంతో మర్రి చెట్టు నదిలోకి కూలి పోతుంది.
చిన్న మొక్కలు చూశావా మేము ముందే చెప్పాము ప్రతి ఒక్కరు పెద్దవారిని గౌరవించాలి అహంకారం ఉండకూడదు నీ అహంకారమే నీ ప్రాణాలు తీసింది.
నీతి:- అహంకారము ఆపదలను కొనితెచ్చును.
superb bro