మారాలి విద్యా వ్యవస్థ – చిన్న వ్యాసం

          ఇప్పుడు విద్య వ్యవస్థను కొంత మంది చాలా వరకు అవినీతిగా మార్చారు వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు. కొన్ని స్కూళ్ళల్లో చుస్తే అవినీతే కనిపిస్తుంది. చదువు అంటే పిల్లలికి, తల్లిదండ్రులకి భయం పుడుతుంది. లంచం అనగా ఫీజు ఏ స్కూలు లో ఎంత కట్టాలో అని ఒక భయం. ప్రతి సంవత్సరానికి ఫీజు పెరుగుతున్నది. ఎంత పెరిగినా చదువు మటుకు చెప్పేవిధానం వాటిల్లో అంతే ఆ మార్క్స్, అవి మారవు.

          పిల్లలు తప్పుచేస్తే ఇంట్లో తల్లిదండ్రులది అని అర్ధం. వాళ్ళు కంట్రోల్ లో పెట్టలేక గురువుకి అప్పగిస్తారు. ఎందుకంటే వారిస్థానం గొప్పది కాబట్టి.

          ఇక ఈ పద్ధతి మారాలి ప్రతి స్కూల్స్, కాలేజ్స్ లో మానవతా విలువలు కచ్చితంగా చెప్పాలి. అనవసరంగా ప్రాజెక్ట్స్ వర్క్స్ పెట్టకూడదు. వేలకువేలు ఫీజులు వసూలు చేయకూడదు.

          ఒక కొత్త శకానికి నాంది పలకాలి.  పిల్లలికి, తల్లిదండ్రులకి విద్య అంటే ప్రేమ కలగాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి.