చింత విత్తు నాట చింతయే మొలకెత్తు
మల్లె లతకు విరియు మల్లె పూలు
పాప కర్మ ఫలము భారము ఇలలోన
ధర్మమె గెలుచు ధరణి లోన
చెట్టు విత్తులందు ఏది ముందను ప్రశ్న
ఎంత తలచిన హ్రుదినెరుగ నైతి
రెండు కావవియని ఎన్ని చూడ మదిని
ఆత్మా పొందె సిద్ది అవగతమున.
అమ్మతనము తెలియ అమ్మయై కనవలె
అమ్మలిచ్చు వరము లాన గలమె
అమ్మ కోపగింప హతుడౌ నరకుడైన
అమ్మ కొరకు కాని ఆస్థి ఏల?
కొమ్మకు తగదమ్మ కోపమిసుమమైన
కోపమున్న పడతి కోమలెటులు
ధరణి కోపగింప దద్ధరిల్లు జగము
కోపముడుగు నరుడు కోటి ధనుడు