Aksharaanjali

Aksharaanjali

అక్షరాంజలి

మూగబోయిన నా గుండెకు ప్రతిస్పందన నీవు
మరిచిన నా నవ్వుకు చిరునామ నీవు
పిల్లగాలి తెమ్మెరకు సుమ పరిమళానివి నీవు
ఉరికే జలపాతానికి సరి మువ్వడివి నీవు

ఇది నీపైన నేను చేసే పొగడ్త అని నువ్వు  అనుకుంటావేమో నేస్తం!!!
కాని నువ్వు నాపైన చూపించే అనురాగానికి నిదర్శనం ఈ నా అక్షరాంజలి

కవిత రచన: సుమ నల్లూరి
Aksharaanjali

For more poems of Suma Nalluri: Click here