బట్టి పట్టే చదువులు వద్దుర చిన్నా….!
భావం ఎరిగిన చదువులు చదవరా కన్నా…..!
మార్కులు, గ్రేడులు నీకు వద్దు…..! నాకు వద్దు…..!
ఎల్లలు లేని ఆకాశమే మన ఙ్ఞానానికి హద్దు…..!
పొత్తములతో కుస్తీ పట్టీ…..! పట్టీ…..! అలసిపోకు
ఆటలు, పాటలే నేర్పును అసలు విద్య…..!
నాలుగు గోడల మధ్యన కాదురా చదువంటే
ప్రకృతితో మమేకం దాని రహస్యం…..!
అర్ధం కోసం అర్థంలేని చదువుల కన్నా…..!
అక్కరకొచ్చే ఙ్ఞానం సంపాదించరా చిన్నా…..
మనసెక్కడో ఉండి…..!మనిషిక్కడ ఉండి
మరమనిషివి అవ్వొద్దురా నాన్న…..!
పరీక్షలో ఫస్ట్ క్లాస్ మార్కుల కన్నా…..!
జీవితమనే పరీక్షలో గెలవడం నేర్వరా బుజ్జి…..!
విలువలు మరిచే విలువలేని విద్యల కన్నా…..!
వెలుగులు పంచే విద్యను అభ్యసించరా నాన్న…..!