పాతాళగంగ – కవిత

అడుగడుగునా బోరు

అందరి ఇళ్ళలో బోర్లు

నీళ్లు పడక ‘భోరు భోరు’

భూగర్భ జలాలు అడుగంటి

పాతాళ గంగ నేడు

‘కన్నీటి’గంగ

నీళ్లు పడని బోర్లు

పసిపాపల మింగేసే

మృత్యు కూపాలు

తల్లుల పాలిట శాపాలు

ప్రభుత్వ యంత్రాంగం లో లేదు చలనం

జనంలో రావాలి చైతన్యం

ఇకనైనా ఆగాలి

ఈ మరణ శాసనం

వర్షపు నీటిని ఒడిసి పట్టి

నింపాలి ఇంకుడు గుంతలు

పెంచాలి భూగర్భ జలాలు

పాతాళ గంగ కావాలి

సంపూర్ణ జల పావన గంగ