కాన ప్రాణుల లోగిలి తరువు
కోయిలమ్మల కొలువు తరువు
ధరణి తొడిగెను హరితవర్ణ వృక్షహారం
ప్రకృతి ఒడిన పుట్టెను ఈ సుందర రాజ్యం
మొక్క మొదలుకొని మ్రాను వరకు
వేరు మొదలు చిగురుటాకుల వరకు
మానవకోటికి సహాయపడే తరువణువణువు
వానలు తెచ్చి రైతులకు దూరం చేసెను కరువు
నవీన నాగరికత పేరిట వృక్షముల తుంచ సాగే
అటవులు తగ్గి అరణ్యజీవులు అంతరించ సాగే
దర్శించలేదా వాతావరణం పై ఆపాయ కాలుష్య ప్రభావం
మరచితిరా ! పుడమి పై జీవహక్కు ప్రతి ప్రాణికి సమానం
వృక్షరహిత రాజ్యమా మనం కోరుకొనే నవనాగరికం
ప్రకృతి వినాశనమా అభివృద్ధిని సూచించు చిహ్నం
మొక్కలు నాటి ప్రతి పౌరుడి కర్తవ్యాన్ని గుర్తుచేద్దాం
మ్రానుల ప్రాముఖ్యత మానవ జాతికి చాటి చెప్పుదాం