అనుక్షణం వెతుకుతూనే ఉంటాను
అక్షర లక్షలలో ప్రోదిపడ్డ అక్షర కుసుమాల కోసం
విలక్షణ ఆలోచనలను వెంటేసుకుని
వెతుకుతూనే ఉంటాను
నచ్చిన పరిమళాలు మనసుకు దొరికినపుడు
నా ఆనందం పంచుకునే
వ్యక్తి కోసం కుడా వెతుకుతూనే ఉంటాను
మనసు మత్తుగా ఉంటే మౌనపు భావాలూ
ఆనందం తాండవిస్తే ఎల్లలెరుగని పదసంపదలు
నా చుట్టూ ఎప్పుడూ పరిభ్రమిస్తూనే ఉంటాయి
నన్ను పలుకరిస్తూ ఉంటాయి
ఒంటరిగా ఉన్నప్పుడు ఉసులాడుతుంటాయి
తుంటరి చేష్టలతో కవితలల్లమంటాయి
ఒంటరిగా ఉండనీక గోల చేస్తుంటాయి
నా మానస పుత్రికలై హృదినిండా నిలిచాయి
అందుకే నేనెపుడు వెతుకుతూనే ఉంటాను
ఒక చక్కటి భావన కోసం
చైతన్య కరదీప్తి కోసం.
chala baagaa raasaaru.