వెల్లి విరిసిన నవ వసంతం – మధుర ఆలోచనల దిగంతం
చిన్ననాటి జ్ఞాపకాల దొంతర – అప్పుడు, ఇప్పుడూ జరిగిన సంబరాల జాతర
ఖమ్మం మెట్టు లో గడిపిన నర్సరీ – అక్కడి స్థానిక ప్రదేశాల వర్ఝరి
నల్లగొండలో నేర్చిన శాఖా– యాది కొచ్చిన పాటల లహరిని పదిల పర్చు కున్న రేఖ
ఆదిలాబాద్ లో శిశుమందిరంలో చదువు – అప్పటిచూ సిన సినిమాల కుదురు
స్నేహితులతో గడిపిన క్షణాలు – పరివారం తో జరుపుకొన్న పండుగలు
కరీంనగర్ అనుబంధం – గ్రంథాలయం లో పుస్తకాల పఠనం
శిశు మందిరం లో చదువు – కరీంనగర్ లో గడిపిన పండుగ సంబురాలు
దర్శించిన ఎన్నో ముఖ్య ప్రదేశాలు – అవి అన్నీ చిరస్మరణీయాలు
నాగభూషణం గారి రక్త కన్నీరు నాటకం – సుబ్బులక్ష్మిగారి సంగీత కచ్చేరి
జరుపుకున్న బ్రతుకమ్మ, దసరా పండుగ, పాటల పోటీలో పాల్గొన్న- మరపు రాని అనుభూతులు
అప్పటి నగరం ఇప్పుడు మారుతున్నా మూలాలు పదిలం
నానమ్మఊరిలో బంధువులతో ఆడిన ఆటలు, గడిపిన క్షణాలు మరువలేనివి
అమ్మమ్మ ఊరిలో చూసిన వీధి నాటకాలు, చదివిన జానపద, డిటెక్టివ్ కథలు
జరుపుకున్న పండుగలు, రేడియో కార్యక్రమాలు వినడం జ్ఞానాన్ని పొందడం
పల్లెల సుందర దృశ్య కావ్యం – అభివృద్ధి ప్రగతికి మూలం.