స్వచ్ఛ భారత్ కవితా గీతం

పల్లవి : నమో భారత జనయిత్రి – స్వచ్ఛ భారత దివ్య ధాత్రి  (2)

చరణం 1 : ప్రధాని పిలుపు – విశ్వానికి మేలుకొలుపు ,

               స్వచ్చత , పరి శుభ్రత – కలగలిపిన విరి పానుపు ,

               పరిసరాల సోయగాల పరిగొలుపు – ఆనంద జీవితం

               ఎల్ల వేళలా హాయి గొలుపు   … // నమో భారత  //

చరణం 2 : శాస్త్రీజీ నినాదం – కష్టించి సాధించాలి హరిత విప్లవం

                 కలుపు తీసి , ఆరోగ్య పంటలను పెంచుదాం

                 ఆరోగ్యమైన ఆహారం , నిర్మల పరిసరాలతో

                 విశ్వ భారత  అభివృద్ధిని గాంచు దాo … // నమో భారత //

చరణం 3 :  గాంధిజీ కలలు గన్న స్వచ్ఛ భారతం  స్వీయ కృషి తో

                      నిర్మించు కుందాం

               తరతరాలుగా బాపూజీ సూచనలను పాటించుదాం,
                                      ఆచరించుదాం

             నిర్మలిన ఆరోగ్య భారతాన్ని అభివృద్ధి పరుచుదాం ..