ప్రపంచములోని మేధావుల వింత అలవాట్లు – World Famous People Strange Habits in Telugu
మేధావులు అంటే సామాన్య వ్యక్తులలా కాకుండా భిన్నముగా ప్రవర్తిస్తారు అనేది వాస్తవము దీనికి చరిత్రలో మేధావుల జీవిత చరిత్రలను పరిశీలిస్తే అనేక ఉదహారణలు లభిస్తాయి ప్రపంచములోని అటువంటి మేధావుల ప్రత్యేకమైన
వింతైన ఆశ్చర్య పరిచే కొన్ని అలవాట్ల ను తెలుసుకుందాము. వీటి ద్వారా మేధావులకు సామాన్య పౌరులకు మధ్య చాలా తేడా ఉన్నది అన్న సత్యాన్నిగమనించవచ్చు.
Table of Contents
1. చార్లెస్ డార్విన్:-
ఈయనకు ఆహారము విషయములో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అయన ప్రపంచ పర్యటనలో ఉండగా అక్కడి జంతు జాలములోని వైవిధ్యాన్ని పరిశీలించటమే కాకుండా తనకు తారస పడిన కొత్త రకము జీవిని తినేవాడుట.కీటకాలను కూడా వదిలే వాడు కాదు. ఆర్మడిల్లో, పేరు తెలియని చాకోలెట్ రంగు ఉండే ఎలుక జాతికి చెందిన జీవి లాంటి వాటిని బాగా ఇష్టపడేవాడుట. ఈయన గ్లట్టన్ క్లబ్ సభ్యుడు కూడా ఈ క్లబ్ సభ్యులు ప్రతివారం సమావేశము అయి ఏ రకమైన ఆహారము కొత్తది వారు ప్రయత్నించింది అది ఎంత రుచిగా ఉన్నదో ఇతర సభ్యులకు వివరించేవారుట.
2. అబ్రహం లింకన్:-
అమెరికాకు 16 వ ప్రెసిడెంట్ అయిన అబ్రహం లింకన్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్లను తన టోపీ క్రింద దాచుకొనేవాడుట. ఒకసారి ఒక ఆడపిల్ల సలహా మేరకు గడ్డము పెంచటం ప్రారంభించాడు
3. విక్టర్ హ్యూగో:-
ఈ రచయిత పనిచేయాలంటే తనకు తానూ వింతైన పరిస్థితులను సృష్టించు కొనే వాడు పనివాళ్లను పిలిచి తన బట్టలను అన్నింటిని తీసుకువెళ్లమనే వాడుట అలాచేస్తే బయటికి వెళ్ళటానికి బట్టలు వుండవు కాబట్టి
తప్పని సరిగా ఇంట్లోనే ఉండి తన రచనలను పూర్తి చేసే వాడుట.గూని ఉన్న నోట్రే డామ్ గురించి వర్క్ చేస్తున్నప్పుడు జుట్టు గడ్డము సగము కత్తిరించుకొని కత్తెరను అవతల పారేసి పనిలో లీనమయే వాడుట.
4. గ్యాబ్రియెల్ కోకో ఛానల్:-
ఈ డ్రెస్ డిజైనర్ ఎప్పుడు మెడలో కత్తెరతో బయటికి వెళ్ళే వాడుట అయన మోడల్స్ వేరే డ్రెస్ డిజైనర్ రూపొందించిన డ్రెస్ వేసుకొని కనిపిస్తే ఆ కత్తెరతో డ్రెస్ చింపి ఇలాగే బావుంటుంది అనేవాడుట.అంటే ఇతర డ్రెస్ డిజైనర్ రూపొందించిన డ్రెస్ లు ఆయనకు నచ్చవు వాటిని తన మోడల్స్ ధరిస్తే చూసి సహించడు.
5.ఫ్రేడెరిక్ షి ల్లర్:-
ఒకసారి మరొక ప్రముఖ వ్యక్తి జాన్ గోథె ఈయనను కలవటానికి వచ్చి ఆయనకోసము వైట్ చేస్తున్నాడట ఇంతలో ఆయనకు చెడ్డ కంపు వచ్చిందట ఎక్కడి నుంచి ఈ కంపు వస్తుందా అని పరీశీలిస్తే డ్రాయర్ సొరుగులో కుళ్ళిన యాపిల్ పళ్ళు ఉన్నాయట అంటే ఈ షిల్లర్ అనే రచయితకు వ్రాయటానికి మూడ్ రావాలి అంటే భరించ లేనంత చెడ్డ కంపు ఉండాలి.
6. చార్లెస్ డికెన్స్:-
ఈ రచయిత వ్రాయటానికి మూడ్ రావాలంటే పారిస్ నగరంలోని శవాగారము కు వెళ్ళే వాడుట తానూ పారిస్ నగరములో ఉంటె తనకు తెలియని ఒక శక్తి ఆ శవాగారమును దర్శించేటట్లు చేస్తుంది తానూ వెళ్ళాలి అనుకోక పోయిన ఆ శక్తి వలన వెళతాను అని చెపుతాడు ఈయన ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన షాంపేన్ (సారాయి)డైట్ ను ఫాలో అయేవాడు.
7.హేన్రి ఫోర్డ్:-
ఈ కార్ల కంపెనీ యజమాని గడ్డి తినటానికి ఇష్టపడేవాడుట. పొలాల వైపుకు వెళ్లి తన కాళ్ళ క్రింద ఉన్న గడ్డిని తీసుకొని ఆ గడ్డితో శాండ్విచ్,సలాడ్, సూప్ చేయించు కొని తినే వాడుట అయన ఉద్దేశ్యములో శరీరము
ఒక యంత్రము వంటిది అందులో కడుపు ఒక బాయిలర్ లాంటిది ఈ బాయిలర్ బాగా పనిచేయటానికి మంచి ఇంధనము (గడ్డి) కావాలి.
8. జార్జ్ గోర్డాన్ బైరన్:-
ఈ రచయితకు జంతువులంటే అభిమానము ఈయన కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయమునకు వెళ్ళినప్పుడు అయన తన కుక్కను వెంట తీసుకు వెళ్ళటానికి ప్రయత్నించాడు కానీ ఆ ఆవరణలో పెంపుడు కుక్కల ప్రవేశము నిషిద్దము.కాబట్టి వారు అనుమతించలేదు దీనికి ప్రతిగా ఈయన ఒక ఎలుగుబంటి పిల్లను తెచ్చుకొని తన గదిలో ఉంచుకున్నాడు ఈ విషయములో విశ్వ విద్యాలము అధికారులతో వాదించి చివరకు గెలిచి తనతో పాటు ఎలుగుబంటిని తన
గదిలో ఉంచుకున్నాడు.ఇదండీ ఆయనకు జంతువుల పట్ల గల ప్రేమ.
9. ఆస్కార్ వైల్డ్:-
ఈ రచయిత అందరు పెంచే కుక్క పిల్లి లాంటి జంతువులు కాకుండా ప్రత్యేకమైన ఎవరు పెంచని జంతువులను పెంచుతూ తనతో తిప్పేవాడు ఒక పెద్ద ఎండ్రకాయను తనతో వీధులలో తిప్పేవాడుట. అలాగే థియేటర్ కు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల ఎలుకను తన ఉంబడి తీసుకు వెళ్ళేవాడుట.
10 క్లార్క్ గాబెల్:-
ఈ హాలీవుడ్ నటుడికి పరిశుభ్రత బాగా ఎక్కవ.మాటి మాటికీ దుస్తులు మారుస్తూ ఉండేవాడు. రోజులో చాలా సార్లు షవర్ (నీటి జల్లు)స్నానము చేసేవాడు తొట్టెలో ఉన్న నీటిలో (టబ్ బాత్) చేసేవాడు కాదుట ఎందుకంటే తొట్టిలో నీరు మురికిగాఉంటుంది అన్న భావన ఆయనకు ఉండేది.
11 థామస్ అల్వా ఎడిసన్:-
ఈ శాస్త్రవేత్త తనతో పని చేయటానికి వచ్చే జూనియర్ శాస్త్రవేత్త లను సెలక్ట్ చేసుకొనే విధము తమాషాగా ఉండేది. ఆ జూనియర్ శాస్త్రవేత్తలను తనతో డిన్నర్ కు ఆహ్వానించి ఒక పాత్రలో వారికి సూప్ ఆఫర్ చేసి వారిని పరిశీలించే వాడుట. ఎవరైనా ఆ సూప్ కు ఉప్పు కలుపుకుంటే వారిని ఉద్యోగములోకి తీసుకొనే వాడు కాదట. దానికి అయన చెప్పే కారణము ముందుగానే ప్రయోగాలు పూర్తి కాకుండానే నిర్ణయాలు తీసుకొనే వారితో తానూ పనిచేయలేను అని అయన అభిప్రాయము.
12 సారా బెర్న్ హర్డ్ట్:-
ఈ హాలీవుడ్ నటి చాలా వింతైన థియేటర్ రాణి ఆవిడ ఎక్కడకు వెళ్లిన ఆవిడ వెంట శవ పేటికను తీసుకువెళ్లేది ఆవిడ ఆ శవ పేటికలోనే పడుకొని తన పాత్రలకు సంబంధించిన సంభాషణలను బట్టి పట్టేది.
13.లుడ్విగ్ వాన్ బీథోవెన్:-
ఈమ్యూజిక్ కంపోజర్ చాల వింతైన పనులు చేసేవాడు చాలా అరుదుగా గడ్డము గీసుకొనేవాడు గడ్డము గీసుకుంటే క్రియేటివిటీ నశిస్తుందని అనే వాడుట ,అయన వేసుకొనే బట్టలు సాధారణముగా బాగ మురికిగాను, చినిగినవి గాను ఉండేవిట అంటే తన అఫియరెన్స్ కు ఏమి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదుట త్రాగే కాఫీ కూడా 60 కాఫీ గింజలతో మాత్రమే తయారు చేయాలనీ అనే వాడుట. ఇవండీ కొంతమంది మేధావుల వింత అలవాట్లు ఇంకా చాలా మంది ఇలాంటి వింత ఆలవాట్ల తో మేధావులు ఉంటారు అందుకే అంటారు ఎవరి పిచ్చి వారికి ఆనందము లేదా ఎవరి కంపు వారికి సొంపు అని.
chaala bagundhi theme and mee artical inka super