1. నెపోలియన్ ను పొట్టివాడు అని అంటారు. ఆ రోజుల్లో ఫ్రెంచ్ వారి సగటు ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. నెపోలియన్ ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. అంటే ఫ్రెంచ్ వారి సగటు ఎత్తు కన్నా కొద్దిగా ఎక్కువే.
2. ఉప్పు నీళ్ళు త్వరగా మరుగుతాయి అన్నది నిజంకాదు. నిజముగా ఉప్పునీళ్ళు మరగాటానికి ఎక్కువ కాలము పడుతుంది.
3. కుక్కలు లాలాజలము ద్వార చెమటను విసర్జిస్తాయి అన్నది నిజం కాదు. కుక్కలు చెమటను కాలి అడుగున గల ప్యాడ్ల ద్వారా విసర్జిస్తాయి .
4. ఐన్ స్టీన్ లెక్కలలో తప్పాడని ప్రచారము కాని ఆయన తప్పింది స్కూలు లో చేరటానికి పెట్టిన ప్రవేశ పరీక్షలో మాత్రమే.
5. గర్భిణీ స్త్రీలు సాధారణముగా పైనాపిల్ తినకూడదని అంటారు కాని పైనాపిల్ లోని బ్రొమలైన్ అనే సమ్మేళనము శిశువు శరీర నిర్మాణానికి తోడ్పడుతుంది.
6. మోనో సోడియం గ్లుటమేట్ తలనొప్పికి కారణము అని అంటారు కాని దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
7. మనకు ఐదు రకాల జ్ఞానాలు ఉంటాయని అంటారు కాని ఇరవై ఒక రకాల జ్ఞానాలు ఉన్నాయని శాస్త్రవేత్తల ఉద్దేశ్యము. వాటిలో నొప్పి, శరీరాన్ని సమతుల్యముగా ఉంచటము ఉష్ణోగ్రతలలో తేడాలను గుర్తించటము వంటివి కొన్ని.
8. మనము రోజు వారి నిత్యకృత్యాలలో 10% మాత్రమే వాడతాము అన్నది అపోహ మాత్రమే కాని రోజు మనము చేసే పనులకు మెదడులోని అన్ని భాగాలను వాడతాము.
9. ఎడ్లు ఎరుపు రంగు చూసి బెదురుతాయని అనుకుంటాం కాని అవి రంగులను గుర్తించలేవు. బుల్ ఫైటింగ్ లో ఎర్రటి గుడ్డ కదలికలు దానికి కోపము తెప్పిస్తాయి తప్ప అ రంగు కాదు.
10. సారాయి మెదడులోని కణజాలాన్ని చంపదు కాని కణాలు చెడిపోయేటట్లు చేస్తుంది
11. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షములో నుంచి చూస్తె కనిపిస్తుంది అని అంటారు నిజానికి అంతరీక్షము నుండి భూమి మీది ఏ కట్టడము కనిపించదు కాని రాత్రులందు నగరాలను గమనించవచ్చు.
12. తిని ఈత కొట్టకూడదు అని అంటారు. అలా చేస్తే కండరాల నొప్పులు (క్రామ్ప్స్ ) వస్తాయని ఒక అపోహ కాని తిన్ననందువల్ల కడుపు నిండుగా ఉండి శ్వాసకు ఇబ్బంది అవుతుంది. ఆల్కహాల్ సేవనము తరువాత ఈతకు దిగరాదు ఎందుకంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
13. మెదడులోని రెండు అర్ధగొళాలలో నేర్చుకొనే నైపుణ్యాలలో ఏ విధమైన తేడా లేదు. ఎడమ అర్ధగోళము కుడి అర్ధగోళము నైపుణ్యాలలొ సమానము.
14. టమోటాలను మనము కూరగాయలుగా పరిగణిస్తాము కాని సైన్సు ప్రకారము అవి పండ్లు.
15. బైబిలులో ఉన్నట్లుగా చెప్పబడుతున్న “త్రీ వైస్ మెన్ (ముగ్గురు తెలివిగల వాళ్ళు )” ప్రస్తావన, అంటే ఖచ్చితముగా ముగ్గురు అని బైబిల్ లో ఎక్కడ లేదు .
16. విశ్వములోని “బ్లాక్ హోల్స్” గా పిలవబడేవి నిజముగా హోల్స్ (రంధ్రాలు) కావు. అవి విశ్వములోని దట్టమైన చాలా ఎక్కువ భూమ్యాకర్షణ కలిగిన ప్రదేశాలు.
17. నాలుక పైన తీపి, పులుపు వగరు, ఉప్పు వంటి రుచులను గుర్తించటానికి ప్రత్యేకమైన భాగాలు ఏమి వుండవు. అన్ని రుచులు నాలుక ఏ భాగములో అయినా గుర్తించబడతాయి.
18. కాఫీ లోని కెఫెన్ శరీరములోని నీటిని తొలగిస్తుందని అపోహ కాని అది నిజముకాదు.
19. అరటి చెట్టు కాదు అది ఒక గుల్మము అంటే గట్టి పడని కాండము కలిగినది.
20. సారాయి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది అన్నది అపోహ. నిజానికి సారాయి చర్మము లోని రక్తనాళాలను పలుచన చేస్తుంది. ఫలితముగా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
21. వైకింగ్స్ హార్న్స్ అనే హెల్మెట్లు (శిరస్త్రాణాలు) నిజానికి 19వ శతాబ్దములో ఒక కాస్ట్యుమ్ రూపకర్త వాగనర్ ఓపెరా కోసము తయారు చెశాడు.
22. భోజనము చేసేటప్పుడు నీళ్ళు తాగితే జీర్ణ రసాలు పలుచబడి జీర్ణక్రియ సరిగా జరగదు అని ఒక అపోహ. అది నిజముకాదు నీరు త్రాగటము వాల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
23. పక్షి పిల్లలను మనము ముట్టుకుంటే తల్లి పక్షి మళ్ళా ఆ పిల్లలను చేరదీయదని ఒక అపోహ కాని అది నిజముకాదు. ఎందువల్లనంటే పక్షులకు ఘ్రాణ శక్తి తక్కువ. మనుష్యుల వాసనను పసిగట్టలేవు.
24. రోజు షేవ్(గడ్డము) చేసుకుంటే పెరిగే జుట్టు బిరుసుగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు అది నిజముకాదు. బిరుసుగా అనిపించటానికి కారణము పెరిగే వెంట్రుకల మొనలు మొద్దుగా ఉండటమే.
25. గాయాలు అయినప్పుడు ఇళ్ళలో పెద్దవాళ్ళు పప్పు తింటే చీము పడుతుంది అంటారు నిజానికి పప్పులో వుండే ప్రోటీనులు గాయాన్ని త్వరగా మానటానికి తోడ్పడతాయి.