ఆ బోర్డు చూసి ఆగిపోయాడు రావు.
మరో మారు ఆ బోర్డు మీదది చదివాడు.
ఆ హాలులోనికి చూశాడు.
గేట్లు బార్లా తీసి ఉన్నాయి. ఎవరూ కానరావడం లేదు.
కదిలి తడబాటు నడకతో వెళ్లి డోర్ బెల్ నొక్కాడు.
ఆ డోర్ బెల్ శబ్దం గమ్మత్తుగా అనిపించింది రావుకు. దాంతో మరో మారు ఆ శబ్దం కోసమే డోర్ బెల్ వినియోగించాడు.
అప్పటికే ఒక ఆయన వచ్చాడు ఆ హాలులోకి.
“చెప్పండి” అన్నాడు.
రావు బయట బోర్డు సంగతి చెప్పాడు.
ఆయన, “రండి” అంటూ ఒక గది లోకి రావును తీసుకు వెళ్లాడు. కుర్చీ చూపించాడు.
రావు కూర్చున్నాడు.
ఆయన ఎదురు కుర్చీలో కూర్చొని, “నా పేరు ఆశీర్వాదం. మీ పేరు” అని మాట్లాడేడు.
రావు తన పేరు చెప్పాడు.
“రావేనా. ఇంకా పేరు ఏమైనా ఉందా” అడిగాడు ఆశీర్వాదం నవ్వుతూనే.
“అంతా రావు అంటారు. కానీ నా పేరు…”
రావుకు అడ్డై, “కానీయండి. నేనూ ఆ నలిగిన పేరుతోనే పిలుస్తాను.” అంటూనే, “ఇక్కడ, అంటే, నాచే బాధలు కొనబడతాయి. కనుక మీ బాధలు చెప్పండి. మీ బాధ బట్టి రేటు చెప్తాను. అది మీకు నచ్చితే దానిని కొనుగోలు చేస్తాను” అని చెప్పాడు ఆశీర్వాదం.
రావు ఇంకా తికమకలోనే ఉన్నాడు.
“చెప్పండి. బయట బోర్డు చూసే వచ్చానన్నారుగా. మరి మీ బాధలు చెప్పేయండి, నాకు వాటిని అమ్మేయండి. సరసమైన ధరే ఇస్తాలెండి” అన్నాడు ఆశీర్వాదం.
రావు ఏమీ మాట్లాడ లేదు ఇంకా.
ఆశీర్వాదం, “ఏమటలా చూస్తూ ఉండిపోయారు” అని అడిగాడు.
“ఆ బోర్డులా మీ మాటలూ నన్ను తికమక పెడుతున్నాయి. పైగా నాకు ఇదంతా విడ్డూరంగా అనిపిస్తోంది.” చెప్పాడు రావు.
“మీరే నాకు భలేలా అనిపిస్తున్నారు. లేకపోతే బయట బోర్డు, ఇక్కడ నేను చాలా క్లియర్గా ఎగ్జిబిట్ అయ్యాం. కాదా” అడిగాడు ఆశీర్వాదం.
“మరే మరే. నేనే నేనే తేరుకోలేకపోతున్నాను.” చెప్పాడు రావు.
చిన్నగా నవ్వేడు ఆశీర్వాదం.
“కొంచెం వాటర్ ఇస్తారా” అడిగాడు రావు.
“దాహమా. గ్లాస్డు వాటర్ చాలా” అడిగాడు ఆశీర్వాదం.
“ఆఁ” అన్నాడు రావు.
“రెండ్రూపాయలు ఇవ్వాలి” చెప్పాడు ఆశీర్వాదం.
“అదేమిటి” పుటుక్కున అడిగేశాడు రావు.
“ఆ దాహం మీ బాధ. దానిని నేను రెండు రూపాయలకు కొంటున్నాను” చెప్పాడు ఆశీర్వాదం.
గతుక్కుమన్నాడు రావు.
ఆశీర్వాదం ఏమీ మాట్లాడలేదు.
“మీ ధోరణి బాలేదు” అని అనేశాడు రావు.
“లేదు లేదు. నేను సరిగ్గానే ఉన్నాను. మీరే గుర్తించలేక పోతున్నారు” చెప్పాడు ఆశీర్వాదం.
ఇబ్బందిగా కదులుతున్నాడు రావు.
“రావుగారూ, బాధ అంటే ఏమిటి. దాహమూ బాధే. దానిని నీళ్లతో తీర్చుకుంటున్నారు. ఆకలీ బాధే. దానిని ఆహారంతో తీర్చుకుంటున్నారు. జబ్బూ బాధే. దానిని మందులతో తీర్చుకుంటున్నారు. ఇలా ఎన్నెన్నో బాధలు. వీటన్నింటినీ మీరు డబ్బు చెల్లించే తీర్చుకుంటున్నారు. కానీ మీరు దానిని కొనుగోలు అని, అటు వారు దానిని అమ్మకాలు అని అంటున్నారు. కానీ నేను, మీవి బాధలని, నేను వాటిని కొనుగోలు చేసుకుంటున్నానని అంటున్నాను.” అని చెప్పాడు ఆశీర్వాదం నిదానంగా, నింపాదిగా.
“లాజిక్ లా ఉందండీ” అన్నాడు రావు.
“అని మీరు అనుకుంటున్నారు. నేను సేల్ కోసం ఇదొక ఫీటు అనుకుంటున్నాను” చెప్పాడు ఆశీర్వాదం.
“సేలా” అన్నాడు రావు ఆశ్చర్యంగా.
“ఆఁ” అంటూ రావును తోడ్చుకొని, ఆ గదిలోనే ఉన్న లిప్టు నుండి పై ప్లోర్ లోకి వెళ్లాడు ఆశీర్వాదం.
ఆ ఫ్లోర్ లో మెడిషన్స్ కౌంటర్, వెచ్చాల కౌంటర్, ఫుడ్స్ కౌంటర్ లను చూసిన రావు ఒక్కమారుగా తల విదిలించుకోగలిగాడు.
కారణం, కింద నుండి గమ్మత్తు ఐన ఆ డోర్ బెల్ శబ్దం తడవు తడవుగా వినిపిస్తుండడంతో.
* * *
Wow. Natural Storty
సూపర్ స్టోరీ.
Kadha baagundi
కురచ కథ ఆయినా అణుబాంబులా పేలిందండీ
Speech కథ చాలా బాగుందండీ.
Super Story
కథ చాలా చాలా బాగుంది.
Excellent
కథ చిన్నదైనా గొప్ప విషయాన్ని చెప్పింది.
కంగ్రాట్స్ సర్
మూలం పాతదైనా కథ, కథనం సరికొత్తది. బాగుంది.
సూక్ష్మంగా గొప్ప సంగతిని ఎంత బాగా చెప్పారండి. అభినందనలండీ.
మంచి కథ
మీరు చిన్న కథల్తో ఎంతో గొప్ప విషయాన్ని చెప్పుతున్నారండీ.
కథ చాలా చాలా చాలా బాగుంది
Katha superb
రచయిత అభినందనీయులు
కథ కథనాలు బాగున్నాయి
Nice
అద్భుతం
The Best Story
కథ బాగుంది
కథ అద్భుతం
Good story
కథ చక్కగా కొత్తగా ఉంది
Superb
యథార్ధం. నిజమైన కథ
Kadha chala bagundi
story bagundi