మంచి మానవత్వం – కవిత

బ్రతకడానికి తినేటపుడు సిగ్గు పడకు…

ఓటమి వచ్చినపుడు నిరాశపడకు…

విజయం పొందినపుడు అతిగా పొంగిపోకు..

తల్లిదండ్రులను, ప్రాణస్నేహితుల్నిమరిచిపోకు.

చెడ్డవారి విమర్శలకై బాధపడకు…

మంచివారి మాటలకి విసుగు చెందకు…

అనాగరికపు ప్రజలకై ఆరాటపడకు…

అదుపు తప్పిన మనిషికై ఆవేశపడకు…

మంచి తెలుసుకొనుటకై మొహమాటపడకు…

అవసరం లేని కోపానికి గురికాకు…

పెద్దల మాటలకి ఎదురు చెప్పకు…

సేవ సహాయము కై వెనుకాడకు….

ఖచ్చితంగా…గొప్పవాళ్ళవుతారు…