అప్పుడు అర్థం అవుతుంది కృష్ణప్రతిక్కి. తాము ఆ జ్వాలముఖి మణి కోసం వెతుకుతున్నామని తెలుసు కాభట్టి మా ద్వారా ఆ జ్వాలముఖి మణి చెజిక్కించుకోవాలని పథకం ప్రకారమే అప్పుడు గ్రంథాలయంలోని పుస్తకాల గురించి చెప్పాడు, చైతన్య అడగానే కాలెజ్ గ్రౌండ్ ని విస్తరించడానికి ఒప్పుకుంటాడు, ఇప్పుడు పోలిస్ ఉన్నాడని సరస్వతి విగ్రహం ప్రక్కకి జరపడానికి ఒప్పుకోలేదు అంటే ఆ చిత్ర పటం ప్రిన్సిపాల్ దగ్గర ఉంటుంది అని చెప్తాడు కృష్ణప్రతిక్. ముగ్గురు వెంటనే ప్రిన్సిపాల్ ఇంటికి చెరుకుంటారు.
ప్రిన్సిపాల్ ని నిలదిస్తాడు ఇన్సపెక్టర్. చేయడానికి ఏమి లేదు కాబట్టి ఒప్పుకుంటాడు ప్రిన్సిపాల్. కృష్ణప్రతిక్ పటం గురించి అడుగుతాడు. అది తన దగ్గరే ఉందని చెప్పి తీసుకొచ్చి కృష్ణప్రతిక్ ఇస్తాడు. ఎట్టకేలకి ఆ పటం దొరికిందని సంతోషిస్తారు. జ్వాలముఖి మణి గురించి ఎమన్నా తెలుసేమో కనుక్కుంటారు. కాని తనకేమి తెలీదని చెప్తాడు ప్రిన్సిపాల్. మరి జ్వాలముఖి మణి గురించి ఎలా తెలుసుకోవడమో అని అలోచిస్తుంటారు. కృష్ణప్రతిక్ ఇలా చెప్తాడు. మనకి రెండు తెలుసు ఇప్పుడు:
1) ఆ ఢైరి ప్రకారం అక్కడే మళ్ళి పెట్టాడు అంటే ఇంకెవరన్న తీసి ఉండాలి.
2) ఒకవేళ ఢైరిలో రాసినట్టు కాకుండా తీసిన చోట పెట్టకపోతె, ప్రిన్సిపాల్ ఇంట్లోనే ఉండొచ్చు.
ఒకవేళ మొదటది జరిగి వేరే ఎవరికన్నా దొరికితే మనం ఇంకేం చెయలేం. అలా కాక రెండవది జరిగి తీసిన చోటు పెట్టకపోతె అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. అంటే ఇక్కడ నుంచి వెతకడం మొదలు పెట్టడం మంచిది. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి “మీకేదో తెలుసుండాలి దాని గురించి ఆలోచించి బాగా చెప్పండి” అని అడుగుతాడు. పోలిస్ కి అనుమానం వస్తుంది కృష్ణప్రతిక్ పై ఎందుకు ప్రిన్సిపాల్ ని అనుమానిస్తునావు అని?
ఎందుకంటే జ్వాలముఖి మణి గురించి వెతుకుతున్నామని తెలిసి మాకు సహాయం చేసారు అంటే తను వెతికి ఉంటారు అప్పటికే. ఏమి తెలియకుండా అలా ఎలా వెతుకుతారు. ఆ జ్వాలముఖి మణి మహిమ తెలీసిన వాళ్ళ తాతగారు కుడా మణి, మంత్రం దగ్గరా ఉన్నా ఏమి చేయలేకపోయారు. అయినా ఆయన వెనక్కి పెట్టలేరనుకుంటున్నాం కాబట్టీ, ఆయన దాచి ఉంచి ఉంటే తన కుటుంబసభ్యులకి చెప్తారు లేకపోతే తాను దాచి ప్రయోజనం లేదు. కాబట్టి ఏదో కచ్చితంగా చెప్పి ఉంటారు. అదే గుర్తు చేసుకోమని చెప్తున్న అని చెప్తాడు కృష్ణప్రతిక్.
దానికి ప్రిన్సిపాల్ ఉండి అది ఏమి లేదు కాని ఆయన చనిపోయేముందు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు కాని మాట పడిపోవడం వళ్ళ ఏమి చెప్పలేకపోయారు అని చెప్తాడు. వాళ్ళ తాతగారు ఇంటికి తీసుకెళ్ళమని చెప్తారు.
అక్కడికి వెళ్ళాక అన్ని గమనిస్తాడు కృష్ణప్రతిక్. అది గమనించాక మీ తాతగారు మళ్ళి జ్వాలముఖి మణి ని ఎక్కడ దొరికిందో అక్కడే పెట్టి ఉండరు అని అంటాడు కృష్ణప్రతిక్. ఎలా చెప్తున్నావు అని అడుగుతారు. ఇక్కడ చుస్తే ఆయనకి అన్ని దాచుకునే అలవాటు ఉన్నట్టుంది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడ అయినా కాని పెట్టె అలవాటు ఉందా అని అడుగుతాడు ప్రిన్సిపాల్ ని. దగ్గరలో ఉన్న మ్యూజియంలో పెడతారు అని చెప్తాడు. అందరు వెళ్ళి వెతుకుతారు. తాతగారు ఇచ్చిన వాటికి ఆయన పేరు పెట్టించుకుంటారు. అలా అన్ని వెతుకుతారు కాని విఫలం అవుతారు. శేఖర్ కి విసుగొస్తుంది. ఇంక వెతకడం అనవసరం అనుకొంటాడు. అప్పుడే ఆయనకి వాళ్ళ పై ఆఫిసర్ నుండి ఫోన్ వస్తుంది వేరే పని మీద. ఇంక లాభం లేదని చెప్పి సెలవు తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంక ఏం చేయాలో అర్థం కాదు కృష్ణప్రతిక్ కి చైతన్యకి, మళ్ళి వాళ్ళ తాతగారు ఇంటికి వెళ్తారు. అక్కడ చైతన్య కి చాలా చిత్ర పటంలు కనిపిస్తాయి. చైతన్య చిత్ర పటాలను గమనిస్తుండటం చూసి ప్రిన్సిపాల్ అవి అన్ని మా తాతగారు గీసారు అని చెప్తాడు. అంతే కాదు ఈ చిత్ర పటాలన్నిటికి ఒక ప్రత్యకత ఉంది అది ఎంటి అంటే తమ ఇంటి దగ్గర ఉన్నా ఒక తటాకము(pond) దగ్గర గీసాడు అని చెప్తాడు. ఇలాంటివి చాలా ఇష్టంగా చూసుకునేవరు అని చెప్తారు. సరె అని కృష్ణప్రతిక్ ఉండి చనిపోయె ముందు ఏమన్న చెప్పారా అని అడుగుతాడు. దానికి ప్రిన్సిపాల్ ఉండి ఏమిలేదు, మా తాతగారు చనిపోక ముందు గీసుకున్న చిత్ర పటాలకేసి చూసి ఎదో చెప్పడానికి ప్రయత్నించారు కాని అంతలోపె మరణించారు. మేము అందరం ఆ చిత్ర పటాలను జగ్రత్తగా పెట్టండి అని చెప్పారేమో అనుకున్నాము. వెంటనే కృష్ణప్రతిక్ ప్రిన్సిపాల్ ని ఆ చిత్ర పటం లో ఉన్నా స్థలం కి తీసుకు వెళ్ళామంటాడు. ఆ స్థలం కి వెళ్ళాక అక్కడ కృష్ణప్రతిక్ కి తటాకము(pond) కనిపిస్తుంది. అది చూసి ప్రిన్సిపాల్ చెప్తాడు-“మా తాత గారు ఎక్కువ టైం ఇక్కడే గడిపారు అని చెప్తా ఉండేవారు”.
ఇది ఎంత లోతు ఉంటది అని అడుగుతాడు కృష్ణప్రతిక్. దానికి ప్రిన్సిపాల్-“ఒక మనిషి ఈ తటాకము లొ దిగితే తల వరకు నీళ్ళు వస్తాయి” అని చెప్తాడు. ఇంక టైం వృధా చెయకుండా ఆ తటాకము లోపలకి వెళ్ళి చూస్తాడు. శ్రమ పడిన దానికి ఫలితం దక్కినట్టుగా లోపల ఒక పెట్టిలో ఆ జ్వాలముఖి మణి కనిపిస్తుంది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతారు ముగ్గురు. వెంటనే సంబరంతో వెళ్ళి మంత్రం ఢైరిలో ఉన్నది కాబట్టి అది తీసి జ్వాలముఖి మణి కి మొక్కి చదువుతారు. కాని ఆ జ్వాలముఖి మణి అనుకునట్టుగా ఏమి మారదు. చాలా సార్లు ప్రయత్నిస్తారు కాని ఏమి మారదు.
ఆలోచనలో పడతారు అందరు. ఎందుకిలా అవుతుంది అని అంటారు చైతన్య, ప్రిన్సిపాల్. అప్పుడు అనుమానం వస్తుంది కృష్ణప్రతిక్ కి. మహారాణి నిజమైన మంత్రం రాసి ఉండకపోవచ్చు. అంత విలువైన జ్వాలముఖి మణి ఒక చెలికత్తెను నమ్మి ఇచ్చి ఉండదు అలాగాకపోయినా పొరపాటునా ఎవరికైన జ్వాలముఖి మణి, మంత్రం పక్క పక్కనే దొరికితే ఆ జ్వాలముఖి మణి యొక్క విలువ తెలిసినవాడు మాత్రం తప్పనిసరి మంత్రాన్ని ఉపయొగిస్తాడు కావున ఆ మంత్రం నాకు తెలిసి ఇది కాదూ, కాని రాణి ఆ మంత్రాని తప్పనిసరి ఎక్కడో ఒకదెగ్గర బద్రపరచి ఉండాలి అని అంటాడు కృష్ణప్రతిక్.
దానికి చైతన్య ఉండి, ఆ రహస్య దారిలో ఉండొచ్చు ఒకసారి వెళ్ళి చూద్దామని అంటాడు. అలాగే అని చెప్పి ముగ్గురు వెళ్ళి ఆ రహస్య దారి అంతటా వెతుకుతారు కాని ఎక్కడ కనబడదు. అందరూ నిరాశ చెందుతారు. ఆ ద్వారం తెరచుకుని చైతన్య, ప్రిన్సిపాల్ బయటకు వస్తారు. అదుపు తప్పి ఆ ద్వారం మూసుకుపోతుంది. మళ్ళి చైతన్య ఆ ద్వారాన్ని తెరుస్తాడు. అందులో నుండి భయటకు వచ్చిన కృష్ణప్రతిక్ చాలా సంతోషంగా మంత్రం కనబడింది అని చెప్తాడు. ఎక్కడ అని ఆత్రుతగా అడుగుతారు. ద్వారం ముగుసిపొయెసరికి నెను నా లైటర్ తీసి వెలిగించాను అప్పుడు ద్వారం వెనుకభాగంలో శివుడ ని ప్రార్దిస్తూ సంస్కృతం పదాలతో ఒక పద్యం కనిపించింది అదే మనం వెతికే మంత్రం అనుకుంటున్నా ఎందుకంటే నేను చదివిన పుస్తకంలో మంత్రం శివుడు పై ఉంటది అని చెప్తాడు.
కాని మంత్రం ఉన్నదని చివర పదం ఏంటో కనపడదు. చాలా గమనిస్తారు కాని ఏం అర్థం కాదు. బయటకి వచ్చి వివిధ పదాలు ప్రయోగించి ప్రయత్నిస్తాడు కృష్ణప్రతిక్. కాని ఏది పని చేయదు. ఎలా తెలుసుకొవాలని మళ్ళి ఆలోచనలో పడతారు కృష్ణప్రతిక్, చైతన్య.
దానికి ప్రిన్సిపాల్, ఒకసారి ఒక అమ్మాయి తన దగ్గరికి ఇలాంటి సంస్కృతం పధాలు ఉన్న ఒక పుస్తకం తీసుకొచ్చింది అని చెప్తాడు. ఆ పుస్తకం ఇంక ఆ అమ్మాయి దగ్గరే ఉండొచ్చు అని చెబుతాడు. ఎవరా అమ్మాయి అని అడుగుతాడు చైతన్య. పేరు అపూర్వ మన కాలెజ్ స్తూడెంట్ అని చెబుతాడు. అయితే తక్షణమే వెళ్ళి ఆ అమ్మాయిని కలుద్దాం పదండి అని బయలుదేరుతారు. వెంటనే వాళ్ళు ముగ్గురు అపూర్వ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కృష్ణప్రతిక్ కి అపూర్వ అని పేరు విన్నప్పటి నుండి మనసులో ఎన్నొ ప్రశ్నలు ఉంటాయి. అపూర్వ రాణి గారు లాగ ఉండటం ఎంటి ఇంక ఆ అక్షరాలు ప్రిన్సిపాల్ చెప్పినట్టు అపూర్వ కి తప్ప ఇంక ఎవరికి కనిపిచకుండ ఉండటం ఎంటి అని పదే పదే ఆలోచిస్తుంటాడు. ఎట్టకేలకి అపూర్వ ఇంటికి చెరుతారు అందరు.
కృష్ణప్రతిక్ అపూర్వ ని పుట్టు పూర్వత్తరాలు అడుగుతాడు. తన కన్న తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపొయారని తను అనాధగా ఉంటే ఇప్పుడు పెంచే వాళ్ళు దత్తత తీసుకున్నారని చెబుతుంది. ఒకవేళా అపూర్వ రాజుల కుటుంబం కి చెందినా కాలెజ్ కంప్యుటర్ రికార్డ్స్ లో వెతికినా కనిపించుండేది కాదేమో అనిపిస్తుంది కృష్ణప్రతిక్ కి. తరువాత ఆ జ్వాలముఖి మణి ని అపూర్వకి అందిస్తాడు కృష్ణప్రతిక్. ఆ జ్వాలముఖి మణి తాకగానే ఏదో తెలియనిది గుర్తొస్తున్నట్టు అనిపిస్తది. ఆ లోపు చైతన్య జ్వాలముఖి మణి కి సంభందించిన మంత్రం నీ దగ్గర ఉంది కదా అది చూపించు, జ్వాలముఖి మణి నుండి వచ్చే ఫలితం సమానంగా పంచుకుంధాం అని చెబుతాడు. ఆ మంత్రంకి సంభందించిన పుస్తకం తెచ్చి ఇస్తుంది. కాని అందులో కూడా ఆఖరి అక్షరం కనబడదు. ఏం చెయాలో తోచదు. కృష్ణప్రతిక్ ని ఒక్కసారి ఆ రహస్య దారి దగ్గరికి తీసుకెళ్ళమంది అపూర్వ.
సరే అని చెప్పి నలుగురు కలిసి రహస్య గుహ కి వెళ్తారు. అక్కడ గోడలపై సంకేతాలను, రేఖాచిత్రము పరీక్షగా చూస్తుంది అపూర్వ. చెప్పటం మర్చిపొయాను, రాణి అవంతిక దేవి మొదట నుండి ఆ జ్వాలముఖి మణి దొరికేంతవరకు ఏమి జరిగిందో అంతా రేఖాచిత్రములతో మొత్తం ఆ రహస్య దారి గోడల పై చిత్రీకరించుంది. ఆ గోడల మీద ఎన్నో వందల చిత్రాలు ఉంటాయి. ఒక్కొక చిత్రం ఒక్కొక కథను కళ్ళకు కట్టినట్టుగా చుపిస్తుంది అపూర్వ కి. ఆ రేఖాచిత్రములను చూసి అందరు అవంతిక దేవి యొక్క ధైర్య సాహాసాలకు ఖంగుతింటారు. కృష్ణప్రతిక్ కుముది రాజ్యానికి జరిగిన మోసం గురించి వివరిస్తాడు, దానికి భాదాపడతారు ఇంక వాళ్ళ తాత ముత్తాతలు కుముది రజ్యానికి చేసిన నష్టం కూడా అర్థం అయిద్ది. కాని మంత్రం లొ చివరి పదం ఏంటి అన్నది ఇంకా ఒక ప్రశ్న.
అవంతిక దేవి కథ అంతా గోడల మీద చిత్రీకరించారు ఇంకా మంత్రం కూడా రహస్య దారి వెనకాల రాసారు. దీని బట్టి ఒకటి మాత్రం అర్థం అయిద్ది కృష్ణప్రతిక్ కి, అవంతిక దేవి చాల తెలివైనది అని. మనకు తెలుసు కాబట్టి ఈ రేఖాచిత్రము, మంత్రం వెనకాల ఒక బలమైనా కారణం ఉండొచ్చు అనుకుంటాడు. చైతన్య వెంటనే ఇది అంతా అవంతిక దేవి చేపించింది అని ఎలాగ చెప్పగలుగుతావు వేరే ఎవరైన చెపించవచ్చు కదా అంటాడు. దానికి కృష్ణప్రతిక్- “రాజు కి అవకాశం లేదు అతను మరణించాక జరిగినవి కుడా చిత్రీకరించారు. ఇంక వేరే ఎవరైన చేపించారు అంటానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ రేఖాచిత్రములో ఉన్న కొన్ని విషయాలు మన తాత ముత్తాతలకు కూడా తెలియవు కాబట్టి వేరే ఎవరికి తెలిసే అవకాశం లేదు ఒకవేళ తెలిసినా ఎవరు ఇలాగ రహస్య ద్వారం లో ఎవరు చూడని స్థలం లొ చిత్రీకరించరు”. ఇప్పుడు మనకి తెలియాలసిన విషయం ఎంటి అంటే దీని వెనకాళ ఎమైన కారణం ఉన్నదా ఉంటే ఎంటీ? మంత్రం అంతా రాసి చివరి పధం ని ఎందుకు రాయాలెదు? ఇలాంటి చాల ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు.
ఇంతా చేసిన అవంతిక దేవి చివరి పధం కి సంబంధించిన క్లూ కూడా ఇక్కడే ఎక్కడో పెట్టి ఉండొచ్చు అనుకుంటారు. అనుకోవడం ఆలస్యం కాలెజ్ మొత్తం జల్లడెస్తారు. అపూర్వకి ఒక ఆలోచన వస్తుంది, మంత్రం సరస్వతి కమలం కింద ఉన్నా రహస్య ద్వారానికి రాసి ఉంటది కాబట్టి ఆ చివరి పధం క్లూ కూడా ఆ మంత్రానికి దగ్గరే ఉండాలి అని సరస్వతి తామర పువ్వు దగ్గరా వెతకడం మొదలుపెడుతుంది. అప్పుడు ఒక సందేహం వస్తుంది, మహరాణి సరస్వతి గుడి చుట్టు 4 స్తంభాలు ఎందుకు కట్టించింద్ది పైగా ఆ 4 స్తంభాలు పైన 4 తామర పువ్వు బొమ్మలు పెట్టి ఉంటాయి. అపూర్వ ఆ 4 బొమ్మల మీద ఎమన్నా ఉందా అని పరిక్షిస్తూ ఉంటది అంతలోకి కృష్ణప్రతిక్ వచ్చి చుస్తాడు. కాని ఉపయోగం ఉండదు. ఇంకా విసిగిపోయి అందరు ఎవరింటకి వాళ్ళు వెళ్ళిపోదం అనుకుంటారు కాని అపూర్వ కి మాత్రం ఆ క్లూ దొరుకుతుంది అని గట్టి నమ్మకం అందుకని చివరిగా ఒకసారి ఆ తామర పువ్వు బొమ్మలని తొలగించి చుడమంటది. మూడూ స్తంభాల పై తొలగించినా ఏమి ప్రయోజనం కనబడదు. ఇక నాలుగో స్తంభం పై ఉన్న తామర పువ్వు ని తొలగిస్తారు. ఆ తామర పువ్వు వెనకాల ఏమో అక్షరాలు రాసి ఉంటాయి అవి చూసిన కృష్ణప్రతిక్, అపూర్వ చాలా సంతోషపడతారు. ఆఖరి పధం మరేమిటో కాదు ఎవరైతే ఆ మంత్రం జపిస్తారో వాళ్ళ జన్మ నక్షత్రం ‘పూర్వ ఫాల్గుణి’ అయ్యి ఉండాలి అలాగ అయిన పక్షాన వాళ్ళ నామదేయమే అని చైతన్య కి చెప్తారు. రాణీ వారి నక్షత్రము కూడా పూర్వ ఫాల్గుణి అని పుస్తకం లో చూసాను ఇంకా పూర్వ ఫాల్గుణి మహా శివ లింగం కి గుర్తు అని కృష్ణప్రతిక్ వివరిస్తాడు. అపూర్వ వెంటనే నా నక్షత్రం కూడా అదే అని చెప్తుంది.
అందరికి కొంచంసేపు వరకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ గజిబిజి గందరగోలం నుంచి బయటకి వచ్చిన చైతన్య కృష్ణప్రతిక్ ని పిలిచి ఎంటి ఎదో అలోచన లో పడ్డావు ఇప్పుడు మనం ఏం చేద్దాం అని ఆలోచించావా అని అంటాడు. దానికి కృష్ణప్రతిక్ – “మనకి మాత్రం ఒకటి అర్థం అయింది అపూర్వ ఎవరో కాదు మన తాత ముత్తాతలు చెప్పినట్టు మహారాణీ అవంతిక దేవి మళ్ళి జన్మించారు. నాకు అపూర్వ ముఖము చూసినప్పుడే అనూమనం వచ్చింది. ఇంకా ఆ తామర పువ్వు బోమ్మ వేనకాల చివరి పదం కి సంబంధించిన క్లూ ఉండొచ్చు అని మన ఎవరికి అనూమనం రాలేదు అపూర్వ కి తప్ప. కాబట్టి అపూర్వ ద్వారా నే ఆ మంత్రమును జెప్పించాలి” అని అంటాడు.
ఇది అంతా వినిన అపూర్వ కి కూడా నిజమేనేమో మళ్ళి రాణివారు తన రూపంలో జన్మించారు అనిపిచ్చిద్ది. సరే అని జ్వాలముఖి మణి ని సరస్వతి దేవి ముందు పెట్టి అపూర్వ ని మంత్రం జపించమంటారు. అపూర్వ శివుడిని మనసులో ప్రార్థించి తన నామదేయమును మంత్రం కి కలిపి ఉచ్చరిస్తుంది. కాని ఏమి ప్రభావం చూపదు. కంగారు పడిపోతారు అందరు. అపూర్వ బాగా అలోచించి సరస్వతి దేవి ఉన్న ఫౌంటెన్ లో నుండి కలుషంలో నీళ్ళు తీసుకొస్తుంది. అపూర్వ ఏం చేస్తుందో అర్థం కాదు కృష్ణప్రతిక్, చైతన్యలకి. ఏం చేస్తున్నావని అడుగుతారు.
ఆ జ్వాలముఖి మణి నీటిలో ఉంటే ప్రభావితం అవుతుంది అని మనము చూసిన రేఖచిత్రంలో ఉంది కదా అని చెప్పి ఆ జ్వాలముఖి మణి ని కలుషంలో పెడుతుంది. తరువాత మంత్రం ఉచ్చరిస్తుంది. ఆ మంత్రం పూర్తవగానే ఆ జ్వాలముఖి మణి దేదిప్యమానంగా వెలుగుతూ జ్యోతులు వెదజల్లుతూ కలుషం నుండి బయటకి నీలం రంగులో వచ్చి మహాశక్తి ఆకారంలోకి మారుతుంది. అది చూస్తున్నా మిగిత ముగ్గురికి జరుగుతున్నది మాయ అన్న భ్రమ కలుగుతుంది. భక్తితో అ మాహాశక్తి ని పూజిస్తారు. చైతన్య నిజమా అన్న అనుమానంతో ఆ శక్తి ఆకారంలో ఉన్న జ్వాలముఖి మణి ని తాకాలని ప్రయత్నిస్తాడు. చైతన్య సమీపిస్తున్నప్పుడు జ్యోతిగా మెరుస్తున్న శక్తి స్వరూపం కాస్త అగ్ని కణాలు విసుర్తునట్టుగా కనిపిస్తుంది. అపూర్వ వెంటనే చైతన్యని ప్రక్కకి లాగేస్తుంది.
ఆ మహాశక్తి ఆగ్రహంతో – “జ్వాలముఖి మణి ని ఎక్కడ నుండి తీసారో అక్కడే పెట్టాలి లెకపొతో ప్రళయం వచ్చి సముద్రం ఉప్పొంగి భూదేవిని ముంచెత్తుతుంది. కుముది రాజ్యానికి చెందిన అవంతిక దేవి రాణి వారు ఆ జ్వాలముఖి మణి ని సముద్ర గర్భంలో నుండీ తీసుకువచ్చారు. రాణి వారు మరణించాక అది ఏ దుర్మార్గుల చేతిలో పడకుండా శివుడు దానిని ఇన్ని రోజులు కాపాడుతు వచ్చాడు. ఇంకా దానిని యథాస్తానంలో పెట్టాలి లేకపొతో మహాశక్తి ఆగ్రహనికి గురౌతారు. ఆ మహత్కార్యం కోసం శివుడికి ఎంతో ఇష్టమైన మకర సంక్రాంతి పర్వదినాన రాణివారి జన్మ నక్షత్రం రోజున అపూర్వ ని జన్మిచేటట్టు చేసాడు. ఈ మహాత్కార్యంలో అపూర్వ ప్రాణాలు కూడా పోవచ్చు కాని జ్వాలముఖి మణి యథాస్తానంలో చేరకుండా ముందె మరణిస్తే వచ్చె ప్రళయం ని తట్టుకొలేరు” అని హెచ్చరించి ఎదాస్తానానికి మారిపొతుంది మణి.
అపూర్వ కి ఏం మాట్లడాలో అర్థం కాక ఇలాగ అంటుంది- “ఒక మంచి కార్యం నా వళ్ళ జరుగుతుంది అంటే దాని కంటే అదృష్టం ఇంకేమి ఉంటది. నేను ఎలాగైనా ఆ జ్వాలముఖి మణి ని యథాస్తానం కి చేర్చాలి”. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఆ సముద్రగర్భం దగ్గరికి ప్రయాణం అవ్వాలి అని అనుకుంటారు.
మహారాణి జ్వాలముఖి మణి ని ఒక సముద్రం నుంచి తీసుకొచ్చిద్ది ఆ సముద్రము ఇప్పుడు సిందు సముద్రముగా ప్రసిద్ది చెందింది అని అంటాడు కృష్ణప్రతిక్. నీకు ఎలాగ తెలుసు అని అందరు అడుగుతారు. దానికి కృష్ణప్రతిక్ –“కొన్ని రోజులు ముందు సిందు మహా సముద్రంలో మహాశక్తి విగ్రహం ఒకటి ఉందని దానిని బయటకు తీసుకురావాడనికి వెళ్ళినా వాళ్ళు ఎవరు బతికి బయాట పడలేదని న్యుస్ పేపర్ లో చూసాను. అప్పుడు నాకు అనుమానం వచ్చి ఆరా తీస్తే విషయం అంతా తెలిసింది అని చెబుతాడు”.
కాని ఏమి నమ్మని చైతన్య ఇంత కష్టపడి జ్వాలముఖి మణి సాధించింది మళ్ళి అక్కడ వదిలివేయడానికా? ఏ ప్రయోజనం లేకుండానా? అన్నది మింగుడుపడదు. ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో పోలిస్ శేఖర్ గుర్తొస్తారు. అతనికి జరిగినది చెప్తే ఏమన్నా ఫలితం ఉంటుందేమో అని అలోచిస్తాడు.
అపూర్వ చనిపోతుంది అని తెలిసి కృష్ణప్రతిక్ భాధపడుతూ ఉంటాడు. “ధైవకార్యం చెయక తప్పదు. నా జన్మ చరితార్ధమవుతుంది. బాధ పడవద్దు” అని ధైర్యం చెబుతుంది అపూర్వ. చైతన్య అనుకున్నట్టుగానే శేఖర్ కి ఫొన్ చేసి జరిగిందంతా చెప్తాడు. శేఖర్ ని తనకి సగం వాటా ఇవ్వాలి లభించిన దానిలో అని చెప్పి, ఒక స్తలం దగ్గరికి రమ్మని ఫొన్ పెట్టెస్తాడు చైతన్య. శేఖర ఇది అంత విని అశ్చర్యపొతాడు, చైతన్య ని కలవడానికి ప్రయాణమవుతాడు. కాని ఒక అలోచన వచ్చి ఆగిపోతాడు-వజ్రం దొరికితే కృష్ణప్రతిక్ వాళ్ళని మోసం చేసి జ్వాలముఖి మణి, మంత్రం దొంగతనం చెయోచ్చు అలా కాకుండా నాకు ఎందుకు ఫొన్ చేసి రమ్మన్నాడు చైతన్య. అంటే నన్ను మోసం చేస్తున్నారా ఇద్దరు కలిసి అని అనుమానం వచ్చిద్ది. ఎందుకైనా మంచిది అని ఆ ఫొన్ కాల్ చైతన్య చెప్పిన స్థలం నుండే వచ్చిందా అని ట్రెస్ చేయిస్తాడు.
ట్రెస్ చేసిన తరువాత అక్కడ లేరని చెప్తాడు తన సహా ఉధ్యోగి. ఆ కాల్ ఎక్కడ నుండి వచ్చిందో కనుక్కుంటాడు శేఖర్. నగర పోలెమెర నుండి వచ్చిందని తెలుస్తుంది. వెంటనే అక్కడి చెక్ పోస్ట్ సిబ్బందికి ఫొన్ చేసి ఎవరైనా ఇద్దరు కుర్రాళ్ళు అనుమానంగా కనిపిస్తే ఆపండి. వాళ్ళు అక్రమ రవాణాదారులు అని చెప్తాడు. వెంటనే అక్కడికి భయలుదేరుతాడు. శేఖర్ వెళ్ళెలోపే అక్కడ పోలిసులు కృష్ణప్రతిక్ ని, చైతన్యని అరెస్ట్ చేస్తారు. శేఖర్ వాళ్ళను చుడాగానే “గన్ పెట్టి నన్నే మోసం చేస్తారా? ఎక్కడ పెట్టారు ఆ జ్వాలముఖి మణి ” అని అడుగుతాడు. దానికి చైతన్య “నీకు నేను కాల్ చేయడం అక్కడికి రమ్మనడం అంతా కృష్ణప్రతిక్ విన్నాడు. నన్ను బెదిరించి ఇటు తీసుకువచ్చాడు” అని చెబుతాడు. మరి జ్వాలముఖి మణి ఎక్కడ ఉంది అని అడుగుతాడు శేఖర్ చైతన్యని. నీకు చెప్పడం చూసి, ఆ అమ్మాయిని రైలులో పంపించాడు. ఈ లోపు చేరాల్సిన గమ్యం చెరుకుని ఉంటుంది. మనం త్వరగా వెళ్ళకపోతె ఇక మనకి దొరకదు అని చెప్తాడు చైతన్య. సరే పదా అని భయలుదేరబోతె ఇప్పుడు “విమానం” లో తప్ప మరెళా వెళ్ళిన ఆ జ్వాలముఖి మణి దొరకదు అని చెబుతాడు చైతన్య. తనకున్న పరిచయాలు వల్ల వెంటనే “విమానం” తెప్పిస్తాడు శేఖర్. కృష్ణప్రతిక్ కి గన్ పెట్టి తీసుకెలతారు.
వీళ్ళు ఇక్కడ భయలుదేరేలోపు అక్కడ అపూర్వ సముద్రం తీరాన పడవ ఎక్కుతుంది. కాసేపట్లో సముద్రగర్భం చేరుకోబోతుందని సంతోషంగ మంత్రం ఉచ్చరిస్తూ ఉంటుంది అపూర్వ. ఇంతలోకి “విమానం” లో చైతన్య, కృష్ణప్రతిక్ మరియు శేఖర్ అక్కడికి చేరుకుంటారు. సరిగ్గా అపూర్వ ఆ సముద్ర గర్భం దగ్గర చేరుకోగానె, పైన “విమానం” లో ఎదురుచుస్తూ ఉంటారు చైతన్య, కృష్ణప్రతిక్ మరియు శేఖర్. “ఆ అమ్మాయె అని శేఖర్ కి చెప్తాడు చైతన్య్. వెంటనే శేఖర్ దగ్గర ఉన్న గన్ తీసి కాలుస్తాడు. బుల్లెట్ తగిలి సముద్రంలో పడిపోతుంది అపూర్వ. శివుడు ఆశిస్సులతో పుట్టుంది కాబట్టి చివరికి అపూర్వ అమ్మావారి కాళ్ళ దగ్గరికి చేరుకుంది. ఇంకా ఆకరి శ్వాసలో ఉన్న అపూర్వ మంత్రం ఉచ్చరిస్తూ మహాశక్తి ని ప్రార్ధిస్తుంది. ఆ జ్వాలముఖి మణి జ్యోతులు వెదజల్లుతూ మహాశక్తి స్వరూపం దాల్చి భయంకరమైన అగ్నికణాలను వెదజల్లుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని తట్టుకోలేక శివుడిని ప్రార్ధిస్తుంది అపూర్వ. మనస్పుర్తిగా ప్రార్ధిస్తే ఏ ధైవం కరుణించదు. దేవుల్లందరు ఒక్కసారిగా ఏకమై ఆ మహాశక్తి ని శాంతింపచేస్తారు. శాంతి అనే మాటా పుట్టిందే అమ్మా దగ్గర నుండి కాబట్టి ఆ మహాశక్తి శాంతించి మణి అకారంలోకి మారి ఆ శక్తి విగ్రహం ముందు ఉన్న కమలం లోకి శాంతంగా ప్రవేశిస్తుంది. మనసా వాచా కర్మన ఆ మహాశక్తికి పూజిస్తూ మహాశక్తి కాళ్ళు దగ్గర పడిపొతుంది అపూర్వ.
మరొవైపు చైతన్య్ ఇప్పుడు ఎంటి పరిస్థితి అని శేఖర్ ని అడుగుతాడు. తన చేతిలో ఉన్న గన్ ని కృష్ణప్రతిక్ పైకి విసిరి “నన్ను మోసం చేసి అబద్ధాలు చెప్పారు మీ ఇద్దరు. నాతోనే ఆడుకున్నందుకు మీకు తగిన గుణపాఠం చెప్తా మిమ్మల్ని తీవ్రవాదులుగా ముద్రించి అరెస్ట్ చేయిస్తా” అని బెదిరిస్తాడు శేఖర్. చైతన్య భయంతో “అదేంటి మీరే కదా ఆ అమ్మాయిని కాల్చారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నారు” అని ఆడుగుతాడు చైతన్య. నన్ను మోసం చేసినందుకు మీకు నేను వేస్తున్న శిక్ష అని చెప్పి విమనం ని దించుతాడు శేఖర్. అందులో నుండీ బయటకి రాగానే పోలిసులు కనిపిస్తారు శేఖర్ కి. వెంటనే వారితో ఈ ఇద్దరిని అరెస్ట్ చేయండి ఒక అమ్మాయిని అనవసరంగా చంపారు అని చెప్తాడు. వెంటనే చైతన్య ఒక్క నిమిషం మా తరపున మా వాదన కూడా విని తర్వాత ఎవర్ని అరెస్ట్ చేస్తారో చెయండి అని చెప్పి తన చేతి వాచ్ కి ఉన్న కెమెరా తీసి తాను విమనం లో తీసిన వీడియో చూపిస్తాడు. గన్ తీసి అమ్మాయిని శేఖర్ కాల్చడం, తరువాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేపిస్తా అన్న విషయం అన్ని చూసి శేఖర్ ని అరెస్ట్ చేస్తారు పోలిసులు.
అప్పుడు చైతన్య్-“ఒక నవ్వు నవ్వి మా మీదా నువ్వు ఒక స్పై (SPY) పెట్టావు అని నాకు తెలుసు. మాకు జ్వాలముఖి మణి దొరికిన వెంటనే నీకు ఆ స్పై ఫొన్ చెసి చెప్పాడు అని కూడా తెలుసు అందుకే నిన్ను దారి తప్పించాడానికి నెను కావాలని నాటకం ఆడాను. అయినా నువ్వు మేము మోసం చేసాము అని తెలుసుకొని మమల్ని చెక్ పొస్ట్ దగ్గర ఆపినప్పుడు నాకు అర్థం అయింది నువ్వు జ్వాలముఖి మణి కోసం దెనికైనా సిద్ధపడతావని. అందుకే నెను నీకు సాహాయం చెస్తునట్టు నటించాను. కాని నువ్వు అపూర్వ ని కాలుస్తావు అని కలలో కూడా అనుకోలేదు. నీ నీచమైన బుద్ది బయటపెట్టాలని అపూర్వ ని నీకు చుపించాను. ఇప్పుడు నిన్ను కటకటాలు వెనకాల వెసాను. ఎవరితోనైనా పెట్టుకో మహాశక్తితో పెట్టుకుంటే మాడి మసి అయిపోతావు” అని చెప్తాడు శేఖర్ తో. అలా జైలు పాలవుతాడు శేఖర్.
ముణివర్యులు చెప్పినట్టు మహారాణి అవంతిక దేవి మళ్ళి జన్మించలేదు అల్లాంటివి మనము సినిమాలో నే చూడగలుగుతాము నిజజీవితంలో కుదరదు. భారతదేశ చరిత్రలో మనం చాలా విన్నాము చెడుని అంతం చేయాడానికి ఎదో ఒక రూపంలో దేవుడు అవతారం ఎత్తుతాడు అలాగె వచ్చే భయంకరమైనా ప్రళయాన్ని ఆపడానికి పుట్టిందే అపూర్వ.
కొన్ని రోజుల తర్వాత
ఒక రోజు జైలులో పనిచేస్తున్న సిబ్బంది ఒకరు శేఖర్ దగ్గరికి వచ్చి “నిన్ను కలవడానికి ఎవరో అమ్మాయి వచ్చింది” అని చెప్తాడు. ఎవరో అర్థం కాక వెళ్ళి చూస్తాడు. ఆ అమ్మాయి ఎవరో తెలీక “ఎవరు మీరు?” అని అడుగుతాడూ. తన పేరు అపూర్వ అని నీవు ఎవరిని చంపాననుకొని జైలు శిక్ష అనుభవిస్తున్నావో ఆ అమ్మాయిని నేనే అని చెప్తుంది. హఠాత్పరిమాణానికి నివ్వెరపోయి తేరుకొని అంటే ఆ అమ్మాయి చనిపోకపోతె నేను ఇక జైలు అనుభవించక్కరలేదని అంటాడూ శేఖర్. “నువ్వు కాల్చింది తననే అని నీకే తెలియదు మాకు తప్ప ఎవరికి తెలియదు. తెలిసిన మేము చెప్పము. ఇక ఎలా భయటకి వస్తావు “అని అంటూ వస్తాడు చైతన్య. తన వెనకే వస్తారు కృష్ణప్రతిక్, ప్రిన్సిపాల్. ఏం జరిగిందో అర్థం కాక బిత్తరపోతాడు శేఖర్.
“వినాశకాలే విపరీతబుద్ధి” అని చెప్పి అక్కడ నుండి భయలుదేరుతారు అపూర్వ వాళ్ళు. అసలేం జరిగింది అంటే – అపూర్వ చెప్పిందంతా నిజమే అని ఎప్పుడైతే ఆ మంత్రం ఆఖరి పదం దొరుకుతుందో అప్పుడే అపూర్వ ని నమ్ముతాడు చైతన్య. సరస్వతి దగ్గర ఆ జ్వాలముఖి మణి మహాశక్తి ఆకారంలోకి మారినప్పుడు, ఆ శక్తి ఆకరిగా అపూర్వ కి రాబోయె ఆపద గురించి హెచ్చరిస్తుంది. అపూర్వ చనిపోతుందని తెలుసుకాబట్టి ఎలా అని అలోచిస్తుంటారు కృష్ణప్రతిక్ వాళ్ళు. ఆ జ్వాలముఖి మణి ని యధాస్తానంలో పెట్టేటప్పుడు ఆపద రావొచ్చు అని చైతన్య అపూర్వ తో ప్రిన్సిపాల్ ని పంపిస్తాడు. ఆ సముద్రా గర్భంలో ఉన్న మహాశక్తి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి చాలా మంది ప్రయత్నించారు కాని ఎవరు బతికి బయట పడలేదు. అది తెలిసి కూడా ప్రిన్సిపాల్ అపూర్వ ని ఎలాగైనా కాపాడాలి అని చాలా పెద్దా సాహాసం చెసీ బుల్లెట్ దెబ్బ తాకి కనిపించిన అపూర్వ ని సముద్రంలో నుంచి కాపాడి హాస్పిటల్ లో చేరుస్తాడు ప్రిన్సిపాల్. ధైవమే వాళ్ళిద్దరిని కాపాడిందని అందరు అనుకుంటారు. అలా ప్రాణాపాయం నుండి తప్పించుకుంటుంది అపూర్వ. శేఖర్ ని అరెస్ట్ చేయాడానికి పోలిసులని పిలిపిచింది కూడా ప్రిన్సిపాలే.
అలా ధైవత్వం సంతరించుకుని 300 సం|| మానవమాత్రుల మధ్య ఉండిపోయిన ఆ మహాశక్తి స్వరూపమైన జ్వాలముఖి మణి మళ్ళి యధాప్రకారం ఆ అమ్మవారి ఒడి చేరుకుంది.
“ధర్మో రక్షతి రక్షిత:”
“ఓం శాంతి శాంతి శాంతి:”