గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
నేను నా ప్లేట్ కడిగి లోపల పెడుతున్నప్పుడు, మడికెట్ల నరుసువాయి చూసింది. ఆమెను చూస్తే నాకు భయమైతది, ఎందుకంటే ఎంత పని చేసిన కానీ నన్ను కొడుతది, తిడుతది.
ఆమె కోపంతో, ‘మంచిగా నీ ఒక్కదానిదే కడిగి పెడ్తున్నవ్? మావి ముందు కడిగినంక నీది కడుక్కోవాలి. ఆడ మా తాటిలు(ప్లేట్లు) ఉన్నయ్. అన్నీ బాయి దగ్గరికి తీసుకుపోయి కడుక్కురా’ చెప్పింది.
అవన్నీ తీసుకుపోయి తోమేసి, కడిగిన. వాటిని తీసుకు వచ్చి ఇంట్లో పెట్టిన.
మళ్ళీ ఆమె, ‘గంగా’ అని పిలిచింది.
‘ఎందీ’ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళిన.
ఆమె, ‘పెద్ద బగోనిల ఉడకవెట్టిన పొడూటి( పొడవాటి)మాంసం ముక్కలు ఉన్నయ్. దబ్బునంకి సుతిలి పెట్టి, ఆ మాంసం ముక్కల్ని కుచ్చు’ అన్నది.
నేను ఆమె చెప్పినట్టు, దబ్బునం కి సుతిలి పెట్టి, బగోని దగ్గరికి వెళ్ళిన. దాంట్లో నుండి ఒక ముక్క తీసిన. ఆ ముక్క రెండు ఇంచుల వెడల్పు, ఆరు ఇంచుల పొడవు ఉన్నది. మిగిలిన ముక్కలను కూడా చూసిన. ఆ ముక్కలు కూడా అంతే సైజ్ లో ఉన్నయ్. నేను ఒక్కొక్క ముక్క తీసుకుంటూ, దబ్బునంతోని నాలుగు మీటర్లు ఉన్న రెండు సుతిలీలకు చాలా ముక్కలను కుచ్చిన. మడికెట్ల నరుసువాయి భర్త వచ్చి, ఇంకా మూడు సుతిలీలకు మిగిలిన ముక్కలను కుచ్చిండు. వాకిట్లో ఎండ పడేదగ్గర మొగురాలకు ఈ అయిదు మాంసం ముక్కల తోరణాలను కట్టిండు.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45