గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
దసరా రోజు..
మడికెట్ల నరుసువాయి కొడుకు, మట్టయ్య దోస్తులను తీసుకొని వచ్చిండు. వాళ్ళను బంగ్ల మీదకి తీసుకుపోయిండు.
మట్టయ్య బంగ్ల దిగి వచ్చి, ‘అమ్మ, మా దోస్తులను తీస్కచ్చిన, వాళ్ళకు తినడానికి బిర్యానీ, కూరలు, నీళ్ళు ప్లేట్లను, గంగ తోని పంపించు’ అన్నడు. ఆమె పంపిస్తా అని చెప్పింది.
మట్టయ్య నా దగ్గరకు వచ్చి, ‘గంగా మా దోస్తులు, నేను బంగ్ల మీద ఉంటం. మా అమ్మ బిర్యానీ, కూరలు, నీళ్ళు ప్లేట్లను నీకు ఇస్తది. నువ్ తీస్కచ్చి సగం మెట్ల దాకా వచ్చి నిల్చొని నన్ను పిలు. నేను వచ్చి తీస్కపోత. నువ్ మీదికి రాకు ‘ అని చెప్పిండు.
సరే అన్న.
ఆమె ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పంపించింది. మొత్తం ఎనిమిది సార్లు బంగ్ల మీదికి ఎక్కుకుంటూ ఇచ్చి వచ్చిన.
వాళ్ళకు అన్నీ ఇచ్చి వచ్చినంక ఆమె, ‘గంగా’ అని పిలిచి, ఒక ప్లేట్లో అన్నం, కూర వేసి నా చేతికి ఇచ్చి ‘ పో అక్కడ అరుగు మీదకు పోయి తిను’ అన్నది. ఆ ప్లేట్లో నాలుగు బొక్కలు, రెండు చిన్న ముక్కలు ఉన్నయ్. ఒక ముక్కను నోట్లో పెట్టి కొరికిన. అది ముక్క కాదు జలుగురు బొక్క. నమిలితే దంగలేదు. కింద పడేసిన. ఒకటే ముక్క మంచిగ ఉన్నది. అది తిని, అన్నం సోర్వ తోని తిన్న. తిన్న తర్వాత ఆ బొక్కలన్నీ, అవతల కుక్కలకి వేసిన. అవి వచ్చి తింటున్నయ్. అవి తినేటప్పుడు చూస్తూ అనుకున్న, ‘మడికెట్ల నరుసువాయి నన్ను కూడా ఒక కుక్కలగా చూస్తుంది. అందుకే బొక్కలు వేసింది’ అనుకుంటూ బాధతో ఇంట్లోకి వచ్చిన. నా ప్లేటు కడిగి లోపల పెట్టిన.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45